పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంతులవారి పత్రికలోని శాపములు లోకమునకెల్ల విదితములయినపిమ్మటనే యొకనాడు ద్వితీయసంఘము కూడుటకు ఇంక రెందు మూడు మాసములుండగా వేంకటరాయశాస్త్రులవారిని కృష్ణమాచార్యులవారు క్రిస్టియన్కాలేజిలో దర్శించి, విమర్శలప్రస్తావముందెచ్చి, 'ఇట్టివిమర్శలు మాత్సర్యముచే వ్రాసినవని లోకులు తలంతురు.' అనిరి. 'కారణమేమని యెవరూహించిననేమి, విమర్శలోనివిషయము సాధువైన లోకులు హర్షింతురు. దానశ్రేయముం బొందుదురు. మాత్సర్యకారణమును తమ కనర్హమయిన కవిపండితకీర్తి నపేక్షించి గ్రంథరచనలుసేసి సద్విమర్శలచే భగ్నులయిన యపండితులు కల్పించుకొందురుగాక. ఇతరులకు కారణాన్వేషణము సేయునంతప్రసక్తిలేదు. అని శాస్త్రులవా రుత్తరమిడిరి. అంతట కృష్ణమాచార్యులవారు 'ఇట్టివిమర్శలు వెడలకుండుటకై మేము కృతవిమర్శోపసంఘ మొకటి నిర్మించెదము' అనిపల్కిరి. 'మనము నిర్మింతము' అనిపల్కలేదు. 'ఉచితమేని నెఱవేరునుగాక' అని శాస్త్రులవారుత్తరమిడిరి. అంతట కృష్ణమాచార్యులవారు వెడలిపోయిరి.

విమర్శగ్రామ్యనాశోపాయములు - తత్సిధ్యుపాయములు - ఇందులకై కృష్ణమాచార్యులవారు కృతివిమర్శోపసంఘమని యొక యుపసంఘమును నిర్మించుటయుపాయముగా నిశ్చయించుకొన్నారు. అట్టి యుపసంఘము నిర్మాతవ్యమని మహాసంఘములలో నిర్ణీతమయ్యెనేని, అటుపిమ్మట ఆయుపసంఘము సాంఘికులను తనవారినిగానే చేర్చుటయు, వారిచే గ్రామ్యవిమర్శ నిరాస మాత్రమేగాక నిజేష్ట సిద్ధాంతము చేయించుచుండుటయు నీషత్కరముగదా.

శ్రీ శేషగిరిశాస్త్రులవారు అగ్రాసన మలంకరించి యుపన్యాస మొకటి చేసిరి. అందు పండితులు జిజ్ఞాసువులై మెలగవలయునని హితోపదేశము చేసిరి. ఆంధ్రభాషోత్పత్తినిగూర్చి చిరపరిశీలనోపలబ్ధములైన తమ యమూల్యాభిప్రాయములను తెలుపందొడంగిరి......

కృష్ణమాచార్యులవారు కృతివిమర్శోపసంఘమొకటి నిర్మింప దగినదని యుద్దేశించిరి. వారివారందఱును సరి యనిరి. వేంకటరాయశాస్త్రులవారు పనికి