పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు శాస్త్రులవారికి జాబువ్రాసినట్లు శాస్త్రులవారు వక్కాణించియున్నారు. ....ఇపుడు వెలువడిన పెద్దవిమర్శ నిజమిత్రులైన కొక్కొండ వేంకటరత్నము పంతులుగారి గ్రంథముపయిదిగాన, ఇపుడు కృష్ణమాచార్యులవారికి శాస్త్రులవారివిమర్శలు పనికిరాకపోయినవి.

వేంకటరత్నముపంతులవారి ప్రసన్నరాఘవముపై విమర్శ వేంకటరాయశాస్త్రులవారు నిరుడు వేసవికాలముసెలవులలో వ్రాయుచుండిరి. నెల్లూరిలోని నిజమిత్రులకుందెలుపుచుండిరి. ఈవృత్తాంతమును పంతులవారికి తన్మిత్రులు నెల్లూరినుండి తెలిపిరట. అంతట పంతులవారు నిజపత్రికలో 'భువనావళి' యనుపేర అతిహేయోపమలతో 14 పద్యములువ్రాసి, అందు విమర్శకులు విమర్శలను లోకమునకుం బ్రకటింపక, రహస్యముగా కవికిందెలుపవలయుననియు, అట్లుచేయువారికి కీర్తికలుగుననియు, ప్రకటించినచో విమర్శకులు అకీర్తిపాలగుదురనియు, విశదపఱిచిరి. శాస్త్రులవారు అందలి సూచనలు లక్ష్యపెట్టక గ్రంథమును ముద్రింపసాగిరి. ఆవిషయము పంతులవారికితెలిసి వారు మఱల నిజపత్రికలో ప్రసన్నరాఘవమును విమర్శచేయువాడు తత్క్షణము మృతినొందుననియును, ప్రకటించిరి. దానింగూడ శాస్త్రులవారు సరకుగొనక ముద్రణము ముగించుచుండగా పంతులవారు ప్రతాపరుద్రీయమును కాల్చివేయవలసినదని పత్రికలో వ్రాసికొనిరి. విమర్శముద్రితమై వెలువడెను. వెలువడగానే వేంకటరత్నముపంతులవారును, వారికి ఆప్తులైన కోలాచలము శ్రీనివాసరావుగారును, వేంకటరత్నముపంతులవారికి శిష్యులనబడు ధర్మవరము రామకృష్ణమాచార్యులును, అట్లే పంతులశిష్యులైన వేంకటసుబ్బయ్యగారును అట్లే పంతులశిష్యులును వేంకటసుబ్బయ్యరుగారికి మిత్రులును అయిన వావిలి కొలను సుబ్బారావుగారును... విమర్శకులైన వేంకటరాయశాస్త్రులవారిని వారి గ్రామ్యమును విమర్శను ద్వేషింపసాగిరి.

మఱియు వేంకటరాయశాస్త్రిగారు తామువ్రాసిన యాంధ్ర ప్రసన్నరాఘవనాటక విమర్శము ముద్రించుచున్నారని కొక్కొండ వేంకటరత్నము