పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లిందులేవు....కవనము-పెద్దయక్షరములవ్రాత కుదురకముందే వ్రాసిన జిలుగు గొలుసు ఎట్లుండునో అట్లున్నది. పాదపూరణము వలన పద్యార్థము ప్రాయికముగా నభేద్యత్వముం బొరసియుండును. పాదపూరణ ప్రయోగమందును, అదియేనియు చక్కగ చేతగామియందును, ఇంతటి కవి మఱిలేడు.... అలంకారశాస్త్రమున జెప్పినదోషములలో ఇందులేనిది లేదు. అందులేనివి ఇందెన్ని యేనిగలవు. తప్పుయతులు, తప్పుగణములు, తప్పుసంధులు, అద్యంతసమాసములు, సరసవస్తుత్యాగము, కొసవిసరులు, అంత్యాశ్చర్యములు, సముచ్చయములు, పౌనరుక్త్యము, ఉక్తానుక్తకావ్యదోషములు, ఇత్యాద్యుపాయము లెన్నియేనియుండియు వీరు పద్యము కుదరక పడినపాట్లు అనుశోచనీయముగా నున్నవి. గద్యమందుగూడ ఆంధ్ర భాషాస్వభావోల్లంఘనములు తెనుగున బనికిరాని సంస్కృత ఫక్కికలు గ్రంథమును చెఱిచినవి. వీరికి సంస్కృతమునందుగల లఘుపరిచయముతో ఇట్టి ప్రబంధముందెనిగింప సాహసించుట గొప్ప పొరబాటు. తెనిగింపులో వీరికి అర్థము చెడినను తెలిసినదిగాదు, రసముచెడినను తెలియలేదు. కథచెడినను తెలియలేదు. లోకస్వభావవిరోధమువచ్చినను తెలియ లేదు. విభక్తిజ్ఞానముకూడ చాలక పెక్కుతావులగ్రంథము చెడినది.....

"సావధానముగా తత్త్వమరయువారు వీరికి సంస్కృతము తెలియదనియు; దేవనాగరలిపి తెలియదనియు, నాటకలక్షణము తెలియనేతెలియదనియు, ఆంధ్రభాషకు వీరు విషముపెట్టినా