పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నరసకవి వ్యాసముంజూచి నవ్వుచున్నారు......మీరు జంకవలదు వ్యాసమూర్తిగారికి మీరు వ్రాయవలదు. నేనేవ్రాయుచున్నాను....ఎట్లువచ్చునో చూతము. శశిలేఖలో వారివ్యాసమంతయు రానిండు. ఆవల బదులీయవచ్చును. ముందుగా మీరేమియు వ్రాయవలదు. మొదటిసంచికవలెనే యంతయు నుండును భయములేదు... ప్రసన్న రాఘవము మాత్రము మఱవకుడు. జంకకుడు. వెనుకంజవేయకుడు. మీకు జయకాలము వచ్చినది. సవ్యసాచిగా నిపుడుండవలెను.

ఇట్లు మీమిత్రుడు
పూండ్ల రామకృష్ణయ్య.
తే 15-10-98 నెల్లూరు.

ఆర్యా, నమస్కారములు.

భాద్రపద సంజీవనిలో బంతులవారు ప్రసన్న రాఘవ విమర్శనుగూర్చి వెక్కిరించియున్నారు. మఱియు బ్రతాపరుద్రీయముంగూర్చి వ్రాసియున్నారు. ఆపద్యములలో బ్రతాపరుద్ర యుగంధరవేషములూనినవారు చచ్చిరనియు నికనీనాటకము చెడినదని ఎగతాళిగ వ్రాసియున్నారు......

పూ. రా.

అంతట శాస్త్రులవారు శ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులవారి యాంధ్ర ప్రసన్న రాఘవ నాటకమును విమర్శించిరి.