పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీవలసినదని యూనివర్సిటివారికి ఈసంఘము వ్రాయవలసినదట. ఈ సభ వారట్టిపెత్తనము పెట్టుకొనుట అనుచితమని వేంకటరాయశాస్త్రులవారికితోచి, కృష్ణమాచార్యులవారిని "ఈరీతిని ప్రతారితులైన వారెవరు?' అని యడిగిరి. వడ్డాది సుబ్బారాయడుగారు' అని వారుత్తరమిడిరి. 'అట్లని సుబ్బారాయడుగా రీసంఘమునకు వ్రాసినారా?' అని మఱల ప్రశ్న, లేదనియుత్తరము. 'కావున మన మిందు ప్రవేశింపగూడదు. సుబ్బరాయని వారికి ఇచ్చియే యుందురు. లేదా వారికి న్యాయస్థానములున్నవి.' అని శాస్త్రులవారు నిషేధించిరి. కృష్ణమాచార్యులవారు ఆయుద్దేశ్యమును త్యజించిరి."


____________