పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జికులు అగ్రాసనాధిపతిగారిని వేంకటరాయశాస్త్రిగారిచే నావిషయంబున మఱల నుపన్యాసముసేయింపుడని ప్రార్థించిరి. తదనుసారముగా నగ్రాసనాధిపతిగారు కోరగా వేంకటరాయశాస్త్రులవారు కాలనిర్బంధములేక అగ్రామ్య విషయముననే ప్రసంగించిరి.

"'పంతులవారు చెప్పినట్లు ఎల్లవారితోను సర్వకాల సర్వాస్థలయందును వ్యాకృతభాషనే భాషింపసమకట్టిన వ్యవహార హానికలుగుననియు గ్రామ్యజనులతో వ్యవహరించునపుడు గ్రామ్యము, పండితులతో భాషించునపుడును వారికి వ్రాయునపుడును వ్యాకృతభాషయునని వ్యవస్థ యేర్పఱుచుకొనుట మంచిది.'

"అని శాస్త్రులవారి యుపన్యాససారాంశము. అట్లే ఆవిషయమంగీకృతమాయెను. కడమయుపన్యాసకులలో పూండ్ల రామకృష్ణయ్యగారిని మాత్రమే బళ్లారి సామాజికులు అగ్రాసనాధిపతి ముఖముగా పల్మాఱువేడి ప్రసంగింపించిరి. వారి వాగ్ఘరికి కడునలరిరి. అగ్రాసనాధిపతిగారు... పండితులు వేదము వేంకటరాయశాస్త్రులవారి వంటివారుగా నుండవలయుననియు నట్టివారు అరుదనియు వక్కాణించిరి.

"కృష్ణమాచార్యులవారు శకటరేఫ అర్ధానుస్వారములు భాషనుండి తొలగింపదగినవని యుద్దేశ్యమును వెల్లడిచేసినారు. వేంకటరాయ శాస్త్రులవారు నిషేధించినారు; కృష్ణమాచార్యులవారు నిషేధము నొప్పలేదు. అంతట శాస్త్రులవారు తమవంతుగా, 'థ,-,-శ,స-భేదము' వీనింగూడ ఆరెంటితో జేర్పుమనిరి. బహువర్ణ నాశోద్దేశమునకు సాహసింపక కృష్ణమాచార్యులవారు నిజోద్దేశ్యమును త్యజించిరి.

"కృష్ణమాచార్యులవా రుద్దేశించిన విషయములలో నిదియొకటి-యూనివర్సిటివారు మెట్రిక్యులేషన్ పరీక్షకు ఆధునిక కవుల గ్రంథములను పెట్టునపుడు ఆకవులకు పారితోషిక మిచ్చుట లేదట. అట్టివారికి పారితోషిక