పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మున వేంకటరాయశాస్త్రులవారిని సహాయోపన్యాసకులు గమ్మని యడిగిరి. శాస్త్రులవారు నిరాకరించిరి. 'అట్లైన మీరేమిచేయుదురు' అని కృష్ణమాచార్యులవారడిగిరి. '6 వ విషయము నాది' అని శాస్త్రులవారు చెప్పిరి. కృష్ణమాచార్యులవారు ఇంచుకంత సంశయించుచు నంగీకరించిరి. శాస్త్రులవా రా యొక యుపన్యాసముదక్క వేఱొకటి పూనుకొనలేదు. కడమ రెండు విషయములను ఇతరులు స్వీకరించిరి. పూర్వోక్త విషయాష్టకములో 5 వది వేంకటరత్నము పంతులవారిది. 'పండితులు గ్రామ్యమును భాషింపగూడదు; వ్రాయనుంగూడదు.' అనునది. వేంకటరాయశాస్త్రులవారిదైన యాఱవ విషయము 'కవులు నూతనమార్గమున గ్రంథములు రచించుట మంచిది' అనునది. మఱునాడు పూర్వాహ్ణమున నుపన్యాసములు ప్రారంభమైనవి. కాలము తెలియుటకై ప్రథానోపన్యాసకునికి 10 నిమిషములయి నంతట హెచ్చరిక గంటను, 15 కాగానే విరామఘంటను వాయించునట్లును, ద్వితీయునికి 5 నిమిషములయినంతట హెచ్చరిక గంటను 10 ని. లయినంతట విరామగంటను, తృతీయునికి విరామగంటను మాత్రమే వాయించునట్లును నియమమేర్పడెను..... కొన్ని కారణములచేత అపూర్వాహ్ణాంతము వేంకటరాయశాస్త్రులవారి 6 వ విషయంగూర్చి యుపన్యసించునట్లుగా అగ్రాసనాధిపతిగారుకోరిరి. శాస్త్రులవా రుపన్యాసమొనర్చిరి. పత్రికోపలేఖకులు, కడమవారి యుపన్యాసములందుంబోలె శాస్త్రులవారి యుపన్యాసము ననుగమింపనేరక లేఖినులను క్రిందవైచి సామాజికపదవి నవలంబించిరి. అగ్రాసనాధిపతిగారును కడమ సకలోపన్యాసములకును వాయించినట్లు శాస్త్రులవారి యుపన్యాసమునకు హెచ్చరిక గంటను వాయింపకయు, విరామగంటను వాయింపకయు శాస్త్రులవారికి కాలప్రమాణ నియమములందొలగించి, శాస్త్రులవారితో 'మీయుపన్యాసము నాపుట నాకిష్టములేదు.' అని నుడివిరి.

"రెండవపూట మరల నుపన్యాసము లారంభమయినవి. వెంకటరత్నము పంతులుగారి గ్రామ్యవిషయము మొదటిది. వా రుపన్యసించుచుండగ సామా