పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10-ప్రకరణము

*[1]ఆంధ్రకవిపండితసంఘము - ప్రథమసమావేశము.

"ఏతన్నిర్మాత బళ్లారిడిస్ట్రిక్టు కోర్టుప్లీడరగు బ్ర.శ్రీ. ధర్మవరము రామకృష్ణమాచార్యులవారు. వారే ప్రథమ ద్వితీయ సంఘములందు కార్యదర్శి" ప్రథమసంఘము బళ్లారిలో 1897 సం. ఏప్రెలు నెలలో ఈస్టరు సెలవులలో జరిగెను. అప్పుడు శ్రీమాన్ రాయబహదర్ పనప్పాకము అనంతాచార్యులు, బి.ఎల్. గారు. అగ్రాసనాధిపతులు....... కృష్ణమాచార్యులవారు ఒకరొకరిని 'మీరీవిషయంబున ప్రధానోపన్యాసకులరయ్యెదరా' అనియు అట్లె సహాయ పోషకోపన్యాసములకు యథోచితముగ నడుగుచుండిరి. పలువురు విషయములం గ్రహించుచుండిరి. వేంకటరాయశాస్త్రులవారు ఏవిషయంబును కోరలేదు. కృష్ణమాచార్యులవారు వారిని ప్రధానోపన్యాసమున కడుగక ద్వితీయమునకు తృతీయమునకును అడుగుచుండిరి. కొక్కొండ వేంకటరత్నము పంతులవారిని మాత్రము ప్రధానోపన్యాసమునకే అడుగుచుండిరి. ఇట్లుండగా నగ్రాసనాధిపతిగారు కార్యదర్శియైన కృష్ణమాచార్యులవారిని 'మీరేల వేంకటరాయశాస్త్రిగారిని వదలివేయుచున్నారు.' అని హెచ్చరికచేసిరి. అంతట కృష్ణమాచార్యులవారు తత్కాలవిచార్యమాణమైన 5 వ విషయ

  1. * కవిపండిత సంఘ చరిత్రతత్త్వము-అని యొక చిన్నపుస్తకమును తృతీయాంధ్రకవి పండిత సంఘసాంఘిక విజ్ఞాపనముగా శ్రీ శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రిగారు (కళావతీ సంపాదకులు నేడు మహామహోపాధ్యాయులు, కళాప్రపూర్ణులు,) కోవూరు సుబ్బరామయ్యగారు, గుండ్లపూడి సుబ్బయ్యగారు, సి. దొరసామయ్యగారు (సత్వసాధనీ పత్రి కాధిపతి) అను నలువురు 1899లో ముద్రించి ప్రకటించిరి. ఇందలి రచన కడుమనోహరముగా నున్నందునను ఈగ్రంథము ఇప్పుడు దొరకనందునను ఇది మరల అచ్చుకాదనుతలంపునున అందలిభాగములనే యిం దుదాహరించుచున్నాడను.