Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యత్నమని మానసికవేత్తలందురు. మనను మనము గీరుకొనినపుడు హాస్య ముద్భవింపదు; ఇతరులు గీరిన నవ్వు పుట్టును. ఇది మానసికమైనది. శారీరకమైన సర్వకాల సర్వావస్థల నిది యుండితీరవలయును గదా!

నవ్వును గూర్చి నానాసిద్ధాంతములు బయలుదేరినవి. మానవుఁడు నిత్యజీవితమునకుఁ గొంతశక్తిని వినియోగించును. అంతకంటే మిక్కుటమైన శక్తి యతనియందు నిగూఢమై యున్నది. అట్టిశక్తి కొన్ని కారణముల వలనఁ బొంగిపొరలుటచే నవ్వు కలుగుచున్నదని 149[1]హెర్బర్టు స్పెన్సరను తాత్త్వికుని యభిప్రాయము. ఒక పట్టుపై వ్యవహరించు మనస్సునకుఁ గొంతగ శ్రమ తగ్గించుటయే దీని ప్రయోజనమని యతని యూహ. అన్న స్నాయువుల నించుక సడలించుటయే దీని ప్రాధాన్యమన్నమాట!

బాలబాలికలు స్వేచ్ఛానుభవములతోఁ గ్రీడించుచుఁగిలకిల నవ్వుచుందురు. ఇట్టి నవ్వుపై తాత్త్వికుని యభిప్రాయము ననుసరించి యధికశక్తిని బహిర్గత మొనర్చుట యనుట పొసఁగదు. మానవుడు కేవలము యంత్రమువలె శ్రమించు కాలమునను నవ్వు కలుగుచున్నది. ఇటువంటి నవ్వులవలన నొకనియమము, సాంఘికనీతి కలుగుచున్నదని 150[2]బెర్గసన్ అభిప్రాయము. ఇతని యభిప్రాయమును గ్రహణ యోగ్యమైనది కాదు. నవ్వు కేవల మధికశక్తి నిరూపకమనిగాని, సంఘనియమమని గాని, యంగీకరించిన దానిని సహజావబోధముగ గమనించుచున్నామన్నమాట!

నవ్వు సహజావబోధము కాదు. దీనికి సాంఘికమైన సమ్మతి యవసరము. ఒక సంఘము నవ్వినట్టు మరియొక సంఘము నవ్వదు. ఒక సంఘము చూచిన నవ్వువచ్చు వస్తువుల నాచారములఁ జూచి మఱియొక సంఘము నవ్వదు. పరిహాస యోగ్యములైన వస్తువులను, పాత్రలను నవ్వు బహుకాలానుభవమును బట్టి నిర్ణయించును. ఇందుకు జనశ్రుతి యాధారము. జనశ్రుతి మూలమున నర్థమొనర్చుకొనిన హాస యోగ్యమైన పాత్రలు వస్తువులు కనుపించి నపుడు పూర్వవిజ్ఞాన మూలమున నవ్వు కలుగును. హాస్యమును గూర్చి యెట్టి సిద్ధాంతమొనర్పవలసినను నాద్యముగ గమనింపవలసిన దీ సాంఘికాంగీకారము.

ఇతరుల యసభ్యతావ్యక్తతలఁ జూచిన మనకు హాస్యముదయించుటచే నవ్వు మన యాధిక్యమును నిరూపించునొక సాధనమని కొందఱి యభిప్రాయము. కొందఱు సామాన్య జనులకంటె నున్నతులమని నిశ్చయ మొనర్చుకొనినవారును, సత్యమున

కధికులైనవారును బ్రాకృతజనముతోఁ బాటు సమస్త సందర్భముల శ్రుతిగలిపి
  1. 149. హెర్బర్టు స్పెన్సర్ - (క్రీ.శ. 1820-1903) ఇకానమిస్టు సంపాదకుడు, ప్రత్యేకతత్త్వ నిరూపకుఁడు. His system of philosophy is based upon the principle that all organic development is a change from homogeneity to heterogeneity.'
  2. 150. బెర్గసన్ - ఒకానొక యాధునిక యూరప్ దేశ తాత్త్వికుఁడు:

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

93