ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శత్రువు మానవమానసరత్నాకరమున లభించు నొక యమూల్యరత్నము. సానఁబెట్టిన పిమ్మట నందుఁ దోఁచు ననంత కోణకాంతిచ్ఛటల దర్శించి యర్థ మొనర్చుకొనఁ గలిగినవాని కాశ్చర్యము గాని, యావేదన గాని కలుగదు. దాని నొక యమూల్యవస్తువుగా గ్రహించి నిజమానస వస్తుప్రదర్శనశాల యందు భద్రపఱచి పరిశీలించుచుఁ బరమ ప్రయోజనమును బరమానందమును బొందు నతఁడొక మహత్తర సాధకుఁడగుట శంకాశూన్యమైన సత్యము. ____________________________________________________________________________________________________
మణిప్రవాళము
87