కొనుట యభ్యుదయ పరంపరలఁ జేకూర్చునని యెవఁడు చెప్పఁగలడు? ఇట్టి
శత్రుత్వములును బ్రయోజనరహితములు. శక్తిసంపన్నుఁడైన శత్రువే ప్రయోజనకారి.
అతఁడె మన 'మూలశక్తి'. అతఁడె మన కెత్తని కీర్తిధ్వజము! అతఁడె మన కీర్తిలతల
'నేడు వారాశుల కడపటి కొండపైఁ గలయఁ బ్రాకించు' దోహదకారుఁడు!!
తాత్కాలిక శత్రుత్వ మిత్రత్వములు గ్రహములకె కాక మనకు నున్నవి. ఇట్టి స్థితులలో సహజశత్రువును, సహజ మిత్రమును గమనించుట కష్టము. ఈ సంధిసమయములఁ గొన్ని సందర్భములలో మన 146[1] కస్తంగతత్వము పట్టుటయుఁ గలదు. 'అన్యోన్యవీక్షల' వలన లోకమున కనామయమగుటయుఁ గలదు; ప్రళయ మగుటయు కలదు.
'నీచేత నపకారమును బొందిన శత్రువుకంటె నీకపకారము చేసిన శత్రువు బలవత్తరమైనవాఁ' డని యొక తత్త్వవేత్త పలికినాఁడు. ఈ యిరువురి యందును మొదటివాని కట శత్రుత్వము స్వతస్సిద్ధ మైనది కాదు. అతని హృదయక్షేత్రమున నా బీజమును నాటినవాఁడవు నీవు. అది యటుపిమ్మటఁ బెఱిఁగి యుండవచ్చును. రెండవాని యందు శత్రుత్వము దానియంత నది పడి మొలకెత్తి పెరుగుచున్నది. అట్టి శత్రువును గూర్చి శ్రద్ధాళువునై యున్న నీకెట్టి ప్రమాదమును లేదని పై తాత్వికుని భావము.
ఒకానొక యాంగ్లకవిపుంగవుఁడు 'శత్రువులు మన బాహ్యాత్మ' లని భావించి నాఁడు. ప్రేమార్ద్రతవలననో లేక స్వతస్సిద్ధముగ లోపముల గుర్తింప నశక్తులగుట వలననో మిత్రులు మేలుచేయలేక పోవుచుందురు. శత్రువులు వానిని బట్టబయలు గావించి విజయగర్వమునఁ బట్టము గట్టుకొనుచుందురు. అందుచే వారు మన గుణముల గ్రహించుటకు యత్న మొనర్పరని కాదు. ఈ విషయమున 'నీ గుణములఁ బైకి మెచ్చుకొనునది నీ మిత్రులు అంతఃకరణమున మెచ్చుకొనువారు నీ శత్రువులు' - అను రవీంద్రగురుదేవుని వాక్యమున ననంతసత్య మంతర్భూతమైయున్నది.
కావున శత్రువును గూర్చి జంక నగత్యము లేకుండుటట్లుండఁ గీర్తిప్రతిష్ఠలు గోరువా రరివర్గము నర్థమొనర్చుటకు యత్నింపవలయు ననియు, నాశన మొనర్చుతఱి నానారీతు లవలంబింప వలయుననియు, నొక శత్రువైన లేనివాఁ డతని వలనఁ గలుగు ప్రయోజనములు గమనించి యెంత విలువనైన నిచ్చి విలిచికొన వలయు
ననియు వ్యక్తమగుచున్నది.- ↑ 146. అస్తంగతత్వము - రవితోఁ జేరిన గ్రహముల కస్తంగతత్వదోషము కలుగుట జ్యోతిషశాస్త్ర ప్రసిద్ధము.
____________________________________________________________________________________________________
86
వావిలాల సోమయాజులు సాహిత్యం-4