పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఈర్యాపరుఁడైన శత్రు వర్థరహితుఁడైన మిత్రుని కంటె నధికుఁ' డని షిల్లరు మహాకవి సెలవిచ్చినాఁడు. ఇందలి మహార్థము సామాన్యదృష్టికి సహజముగ గోచరించకపోవచ్చును. శత్రుత్వమున కీర్ష్య మూలబీజము. ఇది జ్ఞాతముగ నైన నజ్ఞాతముగనైన వృద్ధిపొందుచున్న కొలఁది సుభయపక్షముల సృజనాశక్తి వృద్ధియగును కదా! ఏ యుగమునందైన నత్యుత్తమ కళాసృష్టి జరిగినదన్నను, శాస్త్రార్థవివేచన విజృంభించినదన్నను వాని కభివ్యక్తముకాని యీర్ష్య మూలాధారమై యుండును. 143[1]'ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్వి న్బురాణావళుల్ దెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తా నెట్టిదో తెనుఁగుం జేయరు మున్ను భాగవతము న్దీని న్దెనింగించి నాజననంబు న్సఫలంబు సేసెదఁ బునర్జన్మంబు లేకుండగన్" అని నిగర్వశిరోమణిగఁ బలికిన సహజ శేముషీ ధురంధరుఁడగు పోతనామాత్యుని యందైన యుదయించి యుండక పోదు. ప్రయోజనకరమగు నీర్ష్యకొక చరిత్ర పుట్టిన నెన్ని వైచిత్య్రములున్నచో, దానివలనఁ బ్రపంచ మెట్టి ప్రయోజనములఁ బొందినదో వ్యక్తమైయుండెడిది. అయిన నట్టి చరిత్ర పుట్టుట కవకాశము లేదు. 144[2]'సత్యముతోఁ దాఁ జేసిన పరిశోధనలఁ' జెప్పఁగల ధైర్యసాహసములు మహాత్మునకు దప్ప మఱి యెవ్వరికిఁ గలవు! అర్థరహితుఁడైన మిత్రుఁడు మనకే రీతి నుపయోగకారి కాఁడు. అతని యర్థరహిత నిత్యసాంగత్యము వలన మనపైఁ బ్రభావము నెఱపఁబూనిన నిరుపమానమైన ప్రమాదము సంభవింప వచ్చును; మన యుదాత్తాశయములకు 'స్వస్తిఁ' జెప్పుట తటస్థింప వచ్చును. ఈ కారణములచే నర్థరహితుఁడైన మిత్రునికంటె నీర్యాపరుఁడైన శత్రు వత్యధికుఁడను నంశము నిర్ధారితమగుచున్నది.

మిత్రు లెల్లవేళల మనలోని మంచి నాలోచించెదరు. శత్రువులు నిత్యమును లోపముల వెదకి లోకముఖమున బహిర్గత మొనర్చెదరు. భంగ్యంతరముగ దోషముల గ్రహించి సవరించుకొన నవకాశము కల్పించునది మన శత్రువులు. మనలో 'నేకలవ్యత్వ' మున్న శత్రువును 'ద్రోణగురువుగ' స్వీకరించి వారిమూర్తుల ధ్యానవరద ముద్రలతో 145[3] దక్షిణామూర్తి స్వరూపులుగ 'పర్యంకాసన' మున నిల్పి, పూజించి, శిరము మోడ్చి 'శక్తిపాతము' ను బొందుట చతురత, రసికత, యుదాత్తత, యుచితజ్ఞత!

'బలవంతుఁడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా!' యని

నాఁడొక శతకకర్త. ఈ రీతిగ వ్యవహరించి యర్థరహితమైన శత్రుత్వములఁ గల్పించు
  1. 143. ఒనరన్ - పోతన భాగవతకృత్యాదినిఁ జెప్పిన పద్యము
  2. 144. సత్యముతో - మహాత్ముఁడు తన యాత్మకథకు 'My experiments with truth’ అని నామకరణము చేసినాడు.
  3. 145.దక్షిణామూర్తి - శ్రుతి శాస్త్రార్థ వ్యాఖ్యాన మొనర్చు శివమూర్తి విభేదము

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

85