చైనాఘనకుడ్యము నిర్మితమై యుండెడిది కాదు. బౌద్ధాదిమతములు మనోహర
శిల్పములతో మానవ హృదయముల నాకర్షించుటకు శత్రుభయమే కారణము.
ఆంగ్లేయులు నౌకాయానమున నగ్రగణ్యులగుటకు వీలు కలిగెడిది కాదు. రాక్షసులు
లేక దేవతలు భాసింపనట్లు శత్రువులు లేక శక్తిసంపన్నులు భాసింపరు. ఒకనికి
శత్రువు లధికమనిన నతఁడు శక్తిమంతుఁడని వెల్లడి యగుచున్నది. దేశములు జాతులు
నైనట్లే.
'నీ కేఁబదిమంది మిత్రులున్నను జాలదు. ఒక శత్రువునైఁన దప్పకఁ జూచుకొను' మని యిటలీ దేశమునందొక నీతి. మన దేశమున శత్రుశేషములు ఋణశేషమును మిగుల్పరాదని మఱియొక నీతి. ఋణమొనర్చుటయె తగనిపని. అయినను ఋణశేషము వలన నొక ప్రయోజనమున్నది. వీనిని బూర్తిగఁ జెల్లించిన, బుట్టని ఋణము ఋణ శేషమువలనఁ బుట్టుచున్నది. దీని నివ్వకున్న మొదటి దాని కేమి మొప్పము కలుగునోయను భయమే యిట్టి ఋణము పుట్టుటకుఁ గారణమై యుండవచ్చును. శత్రుశేషము వలన నిట్టి విశిష్ట ప్రయోజనములు సూక్ష్మముగ నాలోచించినఁ గన్పింపకపోవు.
సాటిశత్రువుల విషయమున 'బ్రతికి బ్రతుక' నిమ్మనునది యత్యుత్తమ నీతి. అయిన నతని విషయమున నతిజాగరూకత వహింపవలసిన మాట సత్యము. కనులు మూసికొనిన నెంతటి చతురుఁడైన 'నష్టవిధ నిరయములు' లోని కష్టములకుఁ బాలగుట తప్పదు. శత్రుగుణముల మెచ్చుకొనుట యుదాత్తుని లక్షణములు, 'శత్రోరపి గుణా వాచ్యా వాచ్యా దోషా గుణోరపి' అనునది దేవభాషాసూక్తి. ఇట్టియుదాత్తతకుఁ బురుషోత్తముఁడొక యుత్తమోదాహరణము. అనేకములతోఁబాటు శత్రుగుణముల మెచ్చుకొనఁగల 'సహస్రాక్షుఁ' డను సాహసముననే పూర్వము ముజ్జన్మల లభించు మోక్షమాసించి జయవిజయులు 'వైరభక్తు' లైనారు.
'సంశయాత్మా వినశ్యతి' యని భగవానుఁడు గీతలోఁ బ్రవచించినను సంశయించుట మానవజాతికి నైజమైనది. శత్రువు గర్షణయోగ్యుఁడు కాఁడని యెన్ని ప్రబోధముల వినినను మానవులొకరీతి 'మాయావరణము' నుండి బయటపడ లేకున్నారు. శత్రువును గూర్చి జిజ్ఞాస యొనర్చి 'నేతి నేతి' విధానమునఁ దర్శించిన శత్రువెవఁడు? ____________________________________________________________________________________________________
84
వావిలాల సోమయాజులు సాహిత్యం-4