భానూదయం'తో వీరి ‘వాఙ్మిహికాజలధు' లను ఆపోశనించగలనన్న అంతశ్శక్తి కలవాణ్ణి
అవి అణుమాత్రమైనా కలత పెట్టలేవు.
కబుర్ల రాయుళ్ళు ఒక్కొక్కప్పుడు వాళ్ళను గురించే కోసేస్తుంటారు. ఆత్మస్తుతి కంటే ఆనంద ప్రదమైన విషయం ఏముంది గనక! అందరి గొప్పదనాన్ని గురించీ అవహేళనైతేనేం, వాళ్ళు భంగ్యంతరంగా పలుకుతుంటారు. వాళ్ళ మంచి చెడ్డలమాట ఎవరూ తల పెట్టకపోవటం, వాళ్ళ మనస్సును క్షుభితం చేయటం వల్ల ఈ పనికి పూనుకుంటారు. 'ఎవరూ చెప్పనప్పుడు మన మైనా చెప్పుకోకపోతే ఎలాగనే వారి భయం. అనేకానేక సందర్భాలలో ఇటువంటివారికి 'ఆత్మ విశ్వాసాన్ని' అంటగట్టటమూ, ఆధిక్యమును గుర్తించటమూ లోకంలో గమనిస్తుంటాము. ప్రజాయుగంలో 'స్కోత్కర్ష’ లేనిదే పైకి రాలేమేమో అన్నంత అనుమానం కలిగేటట్లు చేయగలిగారీ 'ఆత్మ ప్రశంసాపరులు!'
కులాసా కబుర్లు చెప్పటమన్నా, వినటమన్నా, 'మహిళాలోకం' మహా ఆదరాన్ని చూపిస్తుంది. స్థూలంగా ఇవి వారి వినోదాలేనని ఏకగ్రీవంగా అంగీకరించవచ్చు. ‘కులాసా కబుర్లకు’ ఒక అధిదేవతను సృజించమని ఏ శతశిల్పిని కోరినా అతడు 'స్త్రీ మూర్తినే' సమాధినిశ్చలుడై దర్శించి తీరుతాడు. 'వర్ణికాభంగం'లో అతనికి కొంత అనుమానం కలుగక తప్పదు. మూల ప్రకృతి వర్ణాన్నే భావిస్తాడు; విను "శిష్య బ్రువులను" చూచి నిశ్చలంగా వికటాట్టహాసం చేసే వికృత రూపినా, కాదు, విమలతేజోమూర్తిని సృజిస్తాడు.
స్త్రీలోకంలో కబుర్లు చెప్పటం ప్రారంభమైతే, పెళ్లి చేసుకున్న తరువాత ఆమె అంత అధమస్థురాలు ప్రపంచంలో లేదని ప్రతి అర్ధాంగీ ప్రారంభిస్తుంది. అంతటి నిస్పృహకు ఏదో నిగూఢమైన కారణం ఉండి ఉంటుందని ఏ మానసిక వేత్తా మనస్సును క్లేశపెట్టుకో నవసరం ఉండదు. సర్వసామాన్యంగా ప్రక్కయింటి ఆవిడ క్రొత్తగా చేయించుకున్న నెక్లేసో, 'పెట్టి పూజ' చేయను పెద్ద యింటి ఆవిడ కొనుక్కున్న క్రొత్త పేటంచు చీరో ఐ ఉంటుంది. అంతగా మనం పొరబాటు పడితే, తత్తుల్యమైనదే మరొకటి తప్పకుండా అయి తీరుతుంది. ఏమైనా ఒకటి సత్యం. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి భగ్గుమనే అత్తాకోడళ్ళనూ విడివిడిగా పిలిచి కబుర్లు చెప్పించి, 'పుల్లింగాలు' పెట్టి వాళ్ళు కాట్లకుక్కలవలె పోట్లాడుకుంటుంటే మనసారా చూచి ఆనందించడం ఆంధ్రదేశంలో ప్రతి అత్తా కోడలికీ అర్థంగాని ఓ సరదా!. ఆధునిక యువతీ మణులలో, ____________________________________________________________________________________________________
ఇతర వ్యాసాలు
839