ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అన్నదియును నీ వ్యంగ్యమార్గమునకు మఱియొక నిదర్శనము. ఇట్టివే “పనస తొనల కన్న పంచదారల కన్న”, “జారపురుషునకును జాజివూవుల తోడ” - మొదలైనవి. ఉపమానములనే చెప్పి విషయమును జెప్పక వ్యంజించుట యను విచిత్రమైన వేమన కవితామార్గమునకు -
“తిరుమలకును బోవ తురక దాసరిగాఁడు
కాశికేగఁ బంది గజముగాదు
కుక్క సింగమగునె గోదావరికిఁ బోవ”
యొక తార్కాణము.
ధర్మము, తత్త్వము, నీతి, పరమతఖండనము మొదలైన యే విషయములఁ జెప్పునపుడైన వేమన కవితలో సారళ్యము, ధారాళత, చెక్కడపు పని, నిర్లక్ష్యము మొదలగు గుణములు గన్పట్టును. భగవద్దత్తమైన అకర్షణశక్తి ఇతని కవితకు విశేషము. ఈతని పద్యము విన్నపుడు ఆకర్షింపబడక యుండుట తెలుఁగువానికి అసాధ్యము. వేమన్నది అచ్చతెనుఁగు కవిత్వము! ____________________________________________________________________________________________________
సాహిత్య విమర్శ
831