Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/829

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"కూడు బెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని
భక్షణంబు చేయుఁ గుక్షిమలము
కూడు విడిచి మలము గుడుచురా ఉపవాసి”

ఇందు కుదాహరణము. దీనికి పెక్కురు నొచ్చుకొన్నను సంతోషించు రసికులు నుందురు.

"సకల తీర్థములకు సకల యజ్ఞంబుల
తలలు గొరుగకున్న ఫలము లేదు
మంత్రజలముకన్న మంగలి జలమెచ్చు”

అన్నదానికి ప్రతివారును నవ్వెదరు. కవితాధార, హాస్యముతోఁబాటు వేమన పేరును సుస్థిరముగ నిల్పినవి నీతులు. ఇతని నీతులు, స్వార్థములు, పరార్థములు అని రెండు విధములు. ఇవి అనుభవమూలములు.

"విన్నవానికన్న కన్నవాఁడధికుఁడు
కన్నవానికన్న కలియువాఁడు”

అనునది యితని నీతులకు అన్వయించును. మంచిచెడ్డల మధించి చెప్పువాఁడగుటచే నితని నీతులకు తీవ్రత యెక్కువ. వేమన పరార్థనీతులందు పూర్వ నీతిగ్రంథములలో వలె స్వార్థము లేదు. ఇతరులకు సుఖముగ గల్గించిన తనకు సుఖము గల్గునని, పూర్వనీతి. లంచ మాశపెట్టుట, భయపెట్టుట లొనర్చి పరోపకారము చేయించుటకు వేమన యిష్టపడఁడు. పుణ్యపాపములు వేమన దృష్టిలో మానవ నిర్మితములు. ఇందుకు "మేనమామ బిడ్డ మెరసి పెండ్లామాయె" ఇత్యాది నిదర్శనము.

వేమనకు ఔదార్యమన నెక్కువ యిష్టము. ఇతని దృష్టిలో అడుగకయే దాన మొనర్చువాఁడు దాత. లోభులపై నితనికి అసహ్యము. "లోభివాని జంప లోకంబు లోపల", "పిసినివాని యింటఁ బీనుఁగు వెడలిన" అను పద్యములలో లోభివాని యెడ నీతని కెట్టిభావమున్నదో తెల్పినాఁడు. ఔదార్యమున్నను వేమన పాత్రాపాత్రత నెఱుఁగును. ఇచ్చుటకు కులము, జాతి, గుణము మొదలగునవి కావు; పేదఱికమే వేమన ప్రధానముగ గణించును. ఈ అభిప్రాయమును “దోసకారియైన దూసరికాఁడైన” ఇత్యాదియందు వెల్లడించినాఁడు. కన్యాదానము గూడ పేదకే యొనర్పవలెనను తన


సాహిత్య విమర్శ

829