నొందిన వీరబ్రహ్మము కందిమల్లయ పాలెములో జీవసమాధి నొందినాఁడు. ఈతని పౌత్రి ఈశ్వరమ్మ బ్రహ్మచారిణియైన యోగినిగా కీర్తికెక్కినది. వీరబ్రహ్మము శిష్యుడైన సిద్ధయ్యయును కొన్ని పాటలు వ్రాసినాఁడు.
అద్వైతమును బోధించు పాటలగు "ఏగంటివారి వచనాలు”, “ఏగంటి లక్ష్మయ్య గారి వచనాలు" ఆంధ్రదేశమున వ్యాప్తిలో నున్నవి. వీనిని పండితుల కంటె పామరులు గమనించి, బోధ నాచరణలోఁ బెట్టినారు. భాషాసౌష్ఠవము, విషయ సంగ్రహశక్తి, ధారాళశయ్య, ఏగంటివారి పదములకు లక్షణము. "ఆనందమయుఁడు గావలెను, మనసు పదిలము చేయవలెను" మొదలైన పాట ఈ గుణవిశేషములను దెలిసికొనుట కొక యుదాహరణము. కన్నడమందలి 'దేవర నామము' ల వలె తెలుగుఁలో అద్వైతబోధ యొనర్చుపాట లెన్నోయున్నవి.
వేదాంతమును పద్యరూపముగ వ్రాసిన శతకకర్తలు తెలుఁగున అసంఖ్యాకులుగ నున్నారు. అట్టివారిలో “సదానందయోగి" శతకకర్తయైన ఆనందవరద రాజయోగి యొకఁడు. వేమన యందలి భక్తితో “వేమనజ్ఞాన మార్గపద్యము" ల నేరి ప్రకటించిన నెల్లూరి జిల్లా నారాయణరెడ్డి పేట రామస్వామి యోగి కుమారుఁడు, దిగంబరయోగి శిష్యుఁడు అయిన ఆధునికుఁడు ముత్యాల నారసింహయోగి “జీవతత్త్వ ప్రబోధకుసుమావళి" అను పేరుతో వేమన మతమును దెలుపు కందపద్య గ్రంథమును వ్రాసినాఁడు. వేమన్నకుఁ గలిగిన అన్యమనస్కసమాధి యిట్టివారి కెంతవఱకు కల్గినదో చెప్పుట కష్టము. వీరిలో కొందఱు అనుభవము లేకున్నను, గురువుల మాటలపై నమ్మకముతో బోధించువారుందురు.
వేమన కవిత్వము, హాస్యము, నీతులు
ప్రజాభిరుచి నెఱిఁగి వారికిఁ దృప్తిగా వ్రాయక పోవుటవలనను, కవి గొప్పతన మెఱిఁగి గౌరవించు ప్రజలు లేకపోవుట వలనను, వేమన పేరుపడ్డ కవి కాలేకపోయినాఁడు. ఇతఁడు ఇతరుల మేలుకోరి వ్రాసినవాఁడే కాని, యితరులు తృప్తికి వ్రాసినవాఁడు కాఁడు. కీర్తికిఁగాని, ద్రవ్యమునకుఁగాని పొగడ్తలొనర్చుట కిష్టపడనివాఁడు. చూచిన దానియందెల్ల తప్పు పట్టుట, తిట్టుట ఇతని స్వభావము. పేదఱికమునందు ద్రవ్యార్జనకు బయలుదేరినపుడు ధనికులను బొగడినాఁడేమో యన్న పద్యము "పడుచునిచ్చు నాని పద్యమిచ్చువాని” ఇత్యాది యొకటి కన్పించుచున్నది.
సాహిత్య విమర్శ
825