Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/820

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శతాబ్ది వఱకును నేదైన కావచ్చును. 16వ శతాబ్దివాఁడనిన శ్రీ ఉత్తంగి చెన్నప్పగారి యూహయును నిశ్చయము గాదు. జన్మను బట్టి తన్ను జనులు పరిహసింపఁగా, నితఁడు జాతిని బట్టి వ్యక్తిని తిరస్కరించువారిపై కత్తిగట్టినాఁడు.

వేమనకువలెనే సర్వజ్ఞమూర్తికి ఆత్మశక్తిపై విశ్వాసమధికము. సర్వజ్ఞుఁడన్న పేరు తల్లిదండ్రులు పెట్టినది కాదు. ప్రభువిచ్చిన బిరుదు కాదు. 'వీఁడు సర్వజ్ఞుఁడా ?” అని యితరు లాక్షేపింప, నిజమే సర్వజ్ఞుఁడ నని యా నామమునే ఇతఁడు గ్రహించినట్లు కన్పించును. వేమనవలె నితఁడును ఉద్రేకి. చదువుసంధ్యల నిర్బంధములు ఎఱుఁగని వాఁడు. సహజమైన కవితాశక్తి గలవాఁడు. హాస్యప్రియుఁడు. వేమన్నకంటే తృప్తితో నిహసౌఖ్యము లనుభవించినాఁడు. వేమనకంటె భోజనప్రియుఁడు. “మంచి సాంసారికజీవితమున్న స్వర్గమునకు నిప్పంటించు” మనినాఁడు. వేమనవలె జారస్త్రీలకు, వేశ్యలకు లొంగినవాఁడు. బంగారు పేఱుచే స్త్రీలు వశులగుదురని యెఱిఁగినాఁడు. వట్టిమాటలతో వేశ్యలను మరులు కొల్పి దగా చేసినవాడే జాణయని తలఁచినాఁడు. సర్వజ్ఞుఁడు జొన్నన్నము, మీఁగడ పెరుగు, వేళకు వచ్చు భార్యయున్నచో వేశ్యను కొఱుత వేయుమనినాఁడు.

సర్వజ్ఞుఁడు వేమనవలె ఆ తృప్తితో బ్రహ్మను పలుమారు తిట్టలేదు. తెలియని వాని జోలికి, సాధ్యము గాని వాని జోలికి పోక, శివుఁడు చూపినట్లుండు మని బోధించినాఁడు. వేమన్న కంటే శాంతమూర్తి. నెమ్మదితనము, ఉదాసీనత ఇతనియందు విశేషము. వేమనవలె చురుకైన మాటగలవాఁడైనను, నితఁడు అతనివలె ప్రపంచము నసహ్యించుకొనలేదు. వేమన కాటవెలఁదిపై ప్రీతి. ఇతనికి సంగీతమున పనికివచ్చు యిష్టము త్రిపది, అతనికి తోడిరాగముపై నభిమానము. ఇతనికి నాటరాగముపై నభిమానము. స్వాతంత్ర్యము, అసహ్యము మొదలగువానిని, దానివలెఁ జూపవచ్చును గాని దీనిలో దైన్యము లేదు. వేమనకు జన్మదుఃఖ మున్నది. సర్వజ్ఞునకు ఉన్నన్నినాళ్లు తనకు, నితరులకు సుఖముగా బ్రతికి చత్తమను భావమున్నది.

సర్వజ్ఞుఁడు యుద్ధవేళ శౌర్యప్రతాపములను ప్రశంసించినాఁడు. బ్రహ్మ యెదురు పడినను బిరుదు చెప్పి పొడువవలె ననినాఁడు. ఇట్టి శౌర్యమున వేమనయును తీసిపోఁడు. శౌర్య, సంసారసుఖములందు ఆశగలవాఁ డగుటచే, సర్వజ్ఞుఁడు రాజసేవ చేసినాఁడు. వేమన రాజులఁ గొల్చినను బహుకాలము సాగలేదు. 'రాచమూక పొందు పాముతోడి పొందని' తలంచి విడిచినాఁడు. సర్వజ్ఞుఁడు రాజుల చిత్తవృత్తి ననుసరించి వినయవిధేయతలతో సేవించినాఁడు. స్వామి కార్యమునకు చచ్చి తీరవలె నన్న భావము


820

వావిలాల సోమయాజులు సాహిత్యం-4