Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/819

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3. ఇతరుల మనసు నొప్పించకుండుట 4. ఉన్నదానితోఁ దృప్తినొందుట 5. ఇతరులతో మత్సరింపకుండుట 6. కోపము విడుచుట 7. ఎల్లప్పుడు నీశ్వరారాధన మొనర్చుచుండుట అను సప్తాజ్ఞలతో గూడిన మతమును కేవలశివాద్వైతి, జాతికులాభిమానముల కతీతుఁడైన వేమన స్థాపించినట్లు, శ్రీ కొమఱ్ఱాజువారు తెలిపినారు. వేమన సామాన్యజనులకు తత్త్వవిచారణ అందరానిదని నిశ్చయించి, ఈశ్వరుఁడొక డున్నాఁడని చెప్పి, పరోపకారాదుల మూలమున ఆ దేవు నెఱుఁగుఁడని బోధించినాఁడు. ఇతని శిష్యులు దీనిని ఎంతవఱ కాచరణలో పెట్టిరో తెలియరాదు. తుంగ వేమన మతము, వేమన మతము నొకటేయైన, కటార్లపల్లెలోని యాతని యుత్సవములలో పూజవేళ పశుబలి జరుగుచున్నది. శిష్యులు గురువునకు వ్యతిరేకముగాప్రవర్తించుట సృష్టిరహస్యములలో నొకటి. వేమన అవసానదశయందు పామూరునొద్ద కొండగుహలోఁ బ్రవేశించి మరల బయటికి రాలేదనుట ప్రబలసాక్ష్యము దొరకువఱకును నమ్మదఁగియున్నది.

వేమన వంటివారు

తమ తమ మతకర్తల మహత్త్వమునకు ఆశ్చర్యపడి, వారి నిర్ణయములే పరమసత్యములని నమ్మి స్వతంత్రముగ విమర్శించు శక్తిని పోఁగొట్టుకొనుట, తమకన్న నజ్ఞానులగువారు తమ యెడనట్లే వర్తింపవలయునని తలంచుట, జనులలో సామాన్యముగ జరుగుచుండును. ఇట్టివారిని తమ స్వతంత్రవిమర్శచే మేల్కొల్పుటకు కొందఱు బయలుదేరుదురు. అట్టివానిలో ఆంధ్రులందు వేమన ముఖ్యుఁడు. వీరిలో వేమన్న తరువాత మొదటి తెలియదగినవాఁడు సర్వజ్ఞమూర్తి. ఇతఁడు వేమన్నకు ప్రతిబింబము వంటి వాఁడగుట, కన్నడము వాఁడగుట యిందుకు ముఖ్య కారణములు. కన్నడులు, తెలుఁగువారికి మిగిలినవారికంటె సమీప బంధువులు. మత ప్రచారాదులందు ఒకరికొకరు తోడ్పడినారు.

సర్వజ్ఞమూర్తి చరిత్రమున వేమన చరిత్రకున్నన్ని చిక్కులున్నవి. ఇతఁడు 'బసవరుసు' అను ఆరాధ్యబ్రాహ్మణునకు, 'అంబలూరు' గ్రామములోని కుమ్మరి విధవయగు 'మాళి' అనుదానికి జన్మించినట్టు కథయున్నది. ఇతఁడు కైలాసమున 'పుష్పదత్తుఁ' డననియు, పరమేశ్వర వర్తమున పుట్టినాఁడననియుఁ జెప్పుకొనినాఁడు. సర్వజ్ఞుఁడు తల్లిదండ్రులను లెక్కపెట్టలేదు. వేమనయును తొలుత తల్లిదండ్రులపై అభిమానముగలవాఁడైనను చివరకు "తన తల్లి గౌరి, తండ్రి శంభుఁడు, పుట్టినిల్లు కైలాసము” అని చెప్పినాఁడు. సర్వజ్ఞమూర్తి కాలము క్రీ.శ. 12 మొదలు 18వ


సాహిత్య విమర్శ

819