బ్రౌనుకు కటారుపల్లె సమాచారము తెలియదు. శ్రీ రాళ్లపల్లివారు కదిరి దగ్గరనున్న “నల్ల చెఱువు” గ్రామమున పట్టెనామము గల వేమన చెక్క విగ్రహమున్న గుడిని చూచి, శివయోగియైన వేమన్నకు పట్టెనామము లేమని యాశ్చర్యపోయినారు. గుడికి పూజారియైన చెన్నయ్య శ్రీ రాళ్లపల్లివారికి “వేమన చరిత్ర" చెప్పినాఁడు.
వేమన్న కొండవీటిలోని పైడిపాల కొడిది రెడ్లవంశమువాఁడు. కనుగోళ్ళ గోత్రము. మొదటి పేరు పుల్లారెడ్డి. రాజైన సోదరునితో కలహించి తల్లితో నల్లచెఱువుకు వచ్చి సేద్యము చేసికొనుచుండఁగా తలపై పిడుగు పడుట, నిర్జీవుఁడగుట, తల్లికి స్వప్నమున కన్పించి ఏడునాళ్ళకు పిమ్మట బ్రతుకుదునని చెప్పి యట్లే యొనర్చుట, తన పేరు పుల్లారెడ్డి కాదు, వేమనయని చెప్పి, యనేక మహత్త్వములతో దేశము తిరుగుట, కడప జిల్లాలోని రాజంపేటలో తల్లి అచ్చమ్మకు, కుచ్చెర్లపాడులో భార్య ఆదిలక్ష్మమ్మకు సమాధులు కట్టించుట, చివరకు కటార్లపల్లెకు తిరిగివచ్చి సజీవసమాధి చెన్నయ్య చెప్పిన వేమన చరిత్రలోని ముఖ్యవిషయములు. వేమన్న పుల్లారెడ్డిగను, తల్లి మల్లమ్మ అచ్చమ్మగను మారుట, ప్రసిద్ధమైన వేశ్యల మాట లేకపోవుట నిందున్నవి. శ్రీ రాళ్లపల్లివారు కటారుపల్లె వెళ్ళి విచారింపగా, ధర్మకర్త చెన్నరాయుఁడు ఆ వేమన్న వేరని తమ తాటాకు గ్రంథమున నున్నట్లు చెప్పినాఁడు. వైకుంఠమునందలి చెన్నకేశవులు, ఆదిలక్ష్మీ, వేమన్నను పిలిచి భూలోకమున జన్మింపుమనఁగా నతఁడు తుంగకేశవునకు, లక్ష్మమ్మకు (అచ్చమ్మ) కేశవనారాయణుల జ్యేష్ఠసోదరుఁడుగా కటారుపల్లెలో జన్మించుట, తరువాత కదిరి దగ్గఱ రేపల్లెకు పోవుట ఇందలి విశేషములు, చెన్నరాయుఁడు నేఁడును వేమన భక్తులు నెల్లూరు మొదలుగ నుండుటవలన, కొండవీటి సంబంధము కల్పుకొని వర్షాశనములు సంపాదించు చున్నామని శ్రీ రాళ్లపల్లివారికి చెప్పినాఁడు. దీనిని బట్టి వేమన్నకు కొండవీటితో సంబంధమున్నట్లు కటార్లపల్లెవారు నమ్మినారు. తుంగ వేమన మన వేమన్న కాఁడు. తుంగ వేమన "బాలచక్ర వేమ భవ్యనామ” మకుటముతో మన వేమనవలె కొన్ని ఆటవెలఁదులు చెప్పినాఁడు. అవియును మకుటము మార్పుతో వేమన పద్యములలోఁ జేరినవి.
తుంగ వేమన క్రీ.శ. 1780 శార్వరి చైత్రశుక్ల నవమినాఁడు జన్మించినట్లు, క్రీ.శ. 1869 వరకు జీవించిన ఇతఁడు, భార్య పుష్యమాసమున మరణించినట్లు కటారుపల్లె గ్రంథములో నున్నవి. ఈ వేమన కాలములు, మన వేమన కాలములు తారుమారైనవి. మన వేమన పుట్టుక, జీవితాంతము లెపుడో చెప్పఁజాలము.
సాహిత్య విమర్శ
803