Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/801

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"వేమన వాక్యము" లని పద్యపునడకలు గల కొన్ని వచనములున్నవి. ఈ వాక్యము ప్రతిదియు నొక చిన్ని వాక్యముల గుంపు. ప్రతి వాక్యము తుదను విశ్వదాభిరామ మకుటమున్నది. ఇవి ఆరు వాక్యములు. యోగ సాంఖ్య తత్త్వములు వీనియందలి ముఖ్యవిషయములు. ఇట్టి వచనరచనలు బసవేశ్వరుఁ డారంభించినాఁడు. అతని తరువాతి శైవులు, వైష్ణవులు నిట్టివానిని వ్రాసిరి.

వేమన గురువు లంబికాశివయోగి కాని, అంబికాశివయోగి కాఁడు. తెలుఁగులో ఆకార ఆకారములకుఁ గల సామ్యమే లంబికాశివయోగియని, అంబికాశివయోగియని కొందరు వ్రాయసగాండ్రు భ్రాంతి నొందుటకు హేతువు. వేమన పద్యముల నిజస్థితిని దెలిసికొనుటకు ప్రాచ్య పుస్తకశాలలోని వ్రాతప్రతులను జూడవలయును.

వేమన - కాలదేశములు

మన చరిత్రలు విచిత్రసిద్దాంతములకు నిలయములు. విశ్వాసపాత్రములు కావు. మనకు లభించు వేమన చరిత్రయు నిట్టిజాతిలోనిదే. పురాణచరిత్రలు రెండును కలిసి యున్న వేమన చరిత్రమునుండి సత్యమైన చరిత్ర యెదియో తెలిసికొన యత్నింతము. వేమన సూక్తి రత్నాకర పీఠికనుండి వేమన చరిత్ర యిట్లు తెలియుచున్నది. ఇతఁడు క్రీ.శ. 1328 మొదలు 1422 వఱకు కొండవీటి రాజ్యమును పాలించిన చివరిరెడ్డి రాజుకు తమ్ముఁడు. కొమరగిరి వేమారెడ్డి కుమారుఁడు. తల్లి మల్లమ్మ. అన్న భార్య నరసాంబ. వేమన్న వేశ్యాలోలుఁడై బొక్కసమంతయు నామెకు దోచిపెట్టుచుండ, తల్లివంటి వదినెయగు నరసాంబ అతని కా వేశ్యపై రోత గల్గునట్లొనర్చినది. కొండవీటి నగరి కంసాలియగు నభిరామయ్య తత్త్వోపదేశమునకై రహస్యముగ లంబికా శివయోగి సేవ యొనర్చుచుండెను. ఆ యోగి అభిరామయ్యతో ఒకనాఁడు మఱునాఁడుదయమున ఉపదేశము నొందుమని చెప్పుటను పొంచి విని వేమన, అభిరామయ్యను బలవంతముగ నగరియందే యుండునట్లొనర్చి తాను వెళ్ళి యోగితో "అభిరామయ్య తాను రాలేక నన్ను పంపినాఁ" డని చెప్పెను. యోగి "వాఁడు నిర్భాగ్యుఁ" డని పల్కి వేమన్నకే యుపదేశ మొనర్చి యెటకో పోయినాఁడు. వేమన్న జ్ఞానియై, అభిరామయ్యకు జరిగినది నివేదించి క్షమాపణ వేడి, విరక్తితో దేశములను దిరిగి పద్యరూపమున ప్రజలకుఁ తత్త్వోపదేశ మొనర్చుచు, తుదకు కటారుపల్లెలో సమాధియందు జేరినాఁడు.”

వ్రాసినవారిది నిజమైన వేమన చరిత్రయని తలచిరి. కాని శ్రీ కొమఱ్ఱాజు లక్ష్మణరావుగారు రాచవేమారెడ్డి కోమటి వేమారెడ్డి కుమారుఁడగుట వలన, కుమారగిరి


సాహిత్య విమర్శ

801