నిగమశర్మ నీచమైన శరీరమును పారవేయునట్లుగా నేలపైఁబడి, అంతములేని విష్ణునిదయచే నరలోకమును విడిచి శ్రీవైకుంఠమును జూచుటకో యనునట్లుగా, తనంతట తానే మరల లేచినాఁడు. ప్రయోజనరహితముగా నెన్నియో యోజనములు అన్నపానములు లేక ఆ దురాత్ముఁడైన నిగమశర్మ కాఱడవులలోఁ దిరిగినాఁడు. తుదకొక నృసింహక్షేత్రమును జేరినాఁడు. మిక్కిలి సమీపించినదై, విశేషముగఁ బరిపక్వమైనదై తన్నుఁ జేరుచున్న పూర్వజన్మ తపఃఫలము వలన నృసింహస్వామికి స్థిరనివాసముగా నొనర్పఁబడిన సంగమతీర్థజలము లందు స్నానమాడి, వైకుంఠ ప్రభువగు నా నృసింహస్వామిని పెక్కుమారులు దర్శించినాఁడు.
నిగమశర్మ తాను విష్ణువు కాఁదలచినవాఁడై, (విష్ణుసారూప్యము నొందఁ దలచినవాఁడై) ముందే యా దేవుని పదియవతారములను ధరించినాఁడో యన్నట్లుగా ఇతరులను కొంచెమైనను తెప్పవాల్చక చూచుచుండును (మత్స్యావతారము). తలకొట్టుకొని దుఃఖసముద్రమునందు మునుఁగును (కూర్మావతారము). రంధ్రమును తెఱువు మనుచు భూమిలోఁ జొరఁబారును (వరాహావతారము). మిక్కిలి యెక్కువయైన కొయ్యబారిన స్థితి వహించును (నరసింహావతారము). బిచ్చ మెత్తువాని వలె నలు దిక్కులకు చేతులు చాచును (వామనావతారము). కాఱుచున్న కన్నీటి సముద్రమున (అస్రాంబుధిని) మునుఁగును (పరశురామావతారము). భార్యను గుఱించి హా! పోయితే? యని దుఃఖించును (రామావతారము). బహువిధైరాసక్తిని విభ్రాంతి నొందును. (బలరామావతారము). సమీపింపలేని చూపు యొక్క స్థితిని (దర్శనస్థితి) వహించును (బుద్ధావతారము). బడబాగ్ని తోఁచుటను ఉదరమున వహించును (కల్క్యవతారము). ఎడతెగని యుపవాసములచే చెవులు వినిపింపక పోయెను. బహుకాలము గడువలేదు. అతఁడు ప్రాణము గోల్పోయినాఁడు.
నిగమశర్మ వైకుంఠమున కేఁగుట
అతని నీచశరీరముపై కాకఘూకము లెక్కినవి. ఏనుఁగు పిండువలె నల్లనైన యమభటసమూహములు అతని యాతనాశరీరము నడ్డగించిరి. "స్త్రీల పెదవి చొంగతోఁ గలిసిన నానారకములైన మద్యముల నన్నింటి నతఁడు క్రోలినాఁడు. వావివర్తనలు లేక కంటి కింపైన స్త్రీని పొంది కామవికారముతో విజృంభించినాఁడు. ప్రజలు పురువులు గారునట్లు తన్ను దిట్టగా అవమానమును సహించి బందిపోటు గావించి బంగారమును సంపాదించినాఁడు. ఇళ్ళకుఁ గన్నములు వైంచి లెక్కకు మించిన
సాహిత్య విమర్శ
793