Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/791

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గదా! ఆకు మఱుఁగు పిందెవలెను అంతఃపురమునం దున్నటులును నున్న పున్నమినాఁటి చంద్రుని వంటి చక్కనైన మోము గల యామె భీతివలనఁ బెఱికిన వేగిరపాటుచేత వెళ్ళుచున్నదే గాని లోపల నాకలిదప్పులను, సూర్యకిరణముల వేడిమిని లెక్కించుట లేదు. మన్మథుని బాణముల వంటి మంటల చేత కలతపడి తపించునట్టి మనసుగలవారికి ఇతరములైన నొప్పులెవ్వియైనను లక్ష్యమా? కాఁపుకోడలును, బ్రాహ్మణాధముఁడైన నిగమశర్మయు గాఢమైన యరణ్యమార్గములందుఁ బయనించి యొక బోయ పల్లెను జూచి శాంతి బొందిరి. ఎన్నియో జన్మలెత్తినఁగాని లభింపని భూదేవజాతిని నిముసములోఁ ద్రోసిపుచ్చి పాపాత్ముఁడైన నిగమశర్మ విపరీతముగ ద్రాగుచు మాంసము దినుచుండెను. దుర్వినీతురాలైన కాఁపు పడుచు గండుతుమ్మెదలు తన యూర్పుగాలి పరిమళములను వాసన చూడఁగా, వేటతమకముచే దానును, ప్రియుఁడును పెద్ద పులులు మొదలగునవి చరించు భయంకరమైన యరణ్యమునందు మెలఁగుచుండెను. నడక, నడుము, కుచములు, జుట్టు, చూపులు అనువాని వలన గలుగు గర్వమున నడ్డరానిదగు నా స్త్రీ వలన మర్యాద నశించినదని తలంచి, సారములేని సంసారము నసహ్యించుకొని వీడఁదలఁచి నెమలి, సింహము, ఏనుఁగు, చమరీమృగముల గుంపు, ఏణములు ఆ కాఁపు పడఁతి వాఁడియైన బాణముల వలని యగ్నిజ్వాలకు మృతి నొందుచున్నవి.

వెదురు బియ్యమును తెల్లగ దంచి బువ్వులవలె చిన్ని లోవిలో వండి దింపి సిద్ధ మొనర్చిన యన్నమును బాగుగాఁ దోమబడిన మూఁకుటియందు వడ్డించి, యనేకరీతులైన యరణ్యపుమాంసములను చుట్టువారగ నుంచి, గవయమృగపు నేయిపోసి, ఆ గవయ మృగము మజ్జిగను సొరకాయ చిప్పలో నుంచి, యొక ప్రక్కన నిల్పి పంక్తిని గూర్చుండి యా సుందరి నవ్వుచు, నాయా రుచులను దెలియఁజెప్పుచు, సగము కొఱికిన యన్నపు బిడుచలను భర్తయైన నిగమశర్మకు నిచ్చుచున్నది.

నిగమశర్మ మాలెతను వరించుట

కాఁపు పడఁతి మరణించిన పిమ్మట మోసమొనర్చి నిగమశర్మ మఱియొక చోట రూపాజీవయు, చంద్రముఖియు, చీఁకటి మానియాకుల గుంపుతో సమానమగు నల్లని శరీరకాంతి గలదియు, క్రొవ్వినదియు, చక్కని పిఱుదులు గలదియు, తిత్తివంటి వీణావాద్యమును చేత ధరించినదియు నైన మాలపడుచుతోఁ గూడి, క్రీడించినాఁడు. ఆ మాల పడుచునందు నిగమశర్మకు అపవిత్రమైన పుత్రలాభము కల్గినది. ఈ రీతిగ బ్రాహ్మణత్వమును గోల్పోయిన నిగమశర్మ పాతాళలోకమునకుఁ బడునట్లుగా నా


సాహిత్య విమర్శ

791