Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/787

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బరుగెత్తిపోయెను. వృద్ధబ్రాహ్మణుఁడు తన తండ్రి యిచ్చిన దర్భముద్రిక పోయినందుకు మనసున గలఁగి చింతించినాఁడు. అత్తగారిచ్చిన హరి సుదర్శనపుఁబేరునకు ముత్తయిదువైన నిగమశర్మ తల్లి దుఃఖించినది. క్రొత్తగాఁ జేయించుకొన్న ముక్కరకై యాఁడుబిడ్డ విశేషముగా దుఃఖించినది. వ్యామోహము గొన్నవాఁడై యల్లుఁడు పోయిన నవగ్రహకర్ణవేష్టమునకై చింతించినాఁడు. ఎట్టి దుర్బుద్ధి! ఎట్టి దుర్ర్భాంతి!! దురాచారశీలుఁడైన అతఁడు సర్వము నూచముట్టుగాఁ దోఁచుకొనిపోయిన తెలియఁగలదా? మోయుటకు సాధ్యపడని పెద్దమూటగాఁ గట్టి యే దారియు తెన్నునులేని పేరడవిలోఁ బ్రవేశించి, యతఁడు చావునకు సంసిద్ధుఁడై వేగముగా నేగుచుండెను. ఒకనాఁటి సాయంకాలవేళ నొక పట్టణమునకు సమీపముగ నున్న భీకరారణ్యములో నతఁడు ప్రయాణమొనర్చుచుండెను.

అట్టివేళ దయారహితులు, కాఱుచీకఁటివలె నల్లనైన రూపము గలవారు, వస్తువులను గాఁజేయుటయందుఁ ద్వరగలవారు, అసాధ్యులు, ప్రపంచద్రోహులు నయిన దొంగలు చేతులెత్తినవారై, ఒక్క పెట్టున మార్గము నాక్రమించి, తొమ్ము పగులునట్లుగా, ప్రకాశించు బాణముల సమూహముచే, కోపముతో నా బ్రాహ్మణ పుత్రుఁడైన నిగమశర్మను గొట్టిరి. ఆ బాణములు శరీరమున పెద్ద గాయములొనర్చినను, వానికిఁగల ఆయుస్సువలన మర్మస్థానములను సోకలేదు. ఒక్కొక్క నెత్తురు బొట్టునకు వేయిమందిగా క్రమ్మి, బకాసురునివంటి యా దొంగలు భ్రష్టుఁడగు నాతని నతివేగముగా దోచుకొని, చెట్టు కొక్కరుఁడుగా పారిపోయిరి.

నిగమశర్మ కాంపుకోడలిని లేవదీసికొని పోవుట

దుష్టుఁడగు నా నిగమశర్మపై జాలిదలఁచి యొక కాఁపుకొడుకు ఇంటికిఁగొని వచ్చినాఁడు. అతనికిఁ గలిగిన యాపదను నివారించు పనియందాసక్తి గొన్నవాఁడైనాఁడు. తండ్రిని విడిచి పుచ్చుట వలన వృద్ధి నొందిన పాపము పోవునట్లుగా నొత్తినాఁడో యన్నట్లుగా, నా కాఁపు బిడ్డ నిగమశర్మ వ్రేళ్ళనెత్తు రొత్తినాఁడు. నిద్రించుచున్న జీవులను మేల్కొలుపునట్లుగా గంట్లయందు పెరుగుతోఁటకూర కాడలను కలిపి వత్తులు పెట్టినాఁడు. సమయముగాదని యమకింకరులను త్రోసిపుచ్చినట్లుగ నాటుకొనిన యస్త్రములను పెఱికిఁనాఁడు. పడుటకు సిద్ధముగానున్న శరీరమును పడకుండగా ఊతకర్రలను నిల్పునట్లుగా పొత్తి గుడ్డలు వెట్టినాఁడు. వట్టికూడు, వేన్నీళ్ళు పెట్టి యెట్టగలుగు తాంబూలము లిప్పించి, సమర్థుఁడైన వైద్యు నేర్పాటు గావించి, కంట వత్తిడుకొని యా కాపుకుమారుఁడు బ్రాహ్మణపుత్రుఁడైన నిగమశర్మను


సాహిత్య విమర్శ

787