“చాపల్యము వలన నిల్లు మొదలగు స్థిరాస్తియు, బంగారము మొదలగు చరాస్తియు నేల భోగస్త్రీలకై నాశము కావలయును? వెలయాండ్ర కీ రీతిగ వ్యయమొనర్చుటకు మహాప్రభువులును, ధనవంతులును జాలరు గదా! ఓ తండ్రీ! ఇందువల్ల నేమిలాభము? అని ప్రశ్నింప వారిని విడిచిపుచ్చుటయే లాభము. చెడునడవడికి నిలయమైన వారస్త్రీలను ఉత్తముఁడు లెక్కింపఁడు. అర్థాంతరములతోఁ గూడిన చమత్కారపు మాటలు, అతివినయములు, వింతలైన కపటపు మెత్తఁదనములు, నానావిధములైన నటనలు, నీచపుఁబనులు, పై మెఱుఁగులు, మొఱటు దనములు, ప్రేలుటలు, వంకర తలపులు, వలపించు నేర్పులు, ఇష్టము లేని యపేక్షలు, పరిహాసములు, కలుపుగోలుతనములు, తప్పుడాటలు, వంచించు కులుకులు, పొందిక గల మాటలు, మోసములు, భ్రాంతులు లేని మచ్చికలు మొదలైన గుణములు గుంపులు, ద్రోహమతులునైన వేశ్యలను జేరిన కీడు వచ్చును. ఇంకనైన నిట్టి అవివేకమును మానుము. నేఁ జెప్పెడి హితము ననుసరింపుము. నీకుఁ గావలసినచో హరి కౌస్తుభమునైనఁ దెచ్చియిచ్చెదను. అసాధ్యులయిన కుచ్చితపు దుష్టులను విడువుము. నీవు పూర్ణకాముఁడవు. నా తమ్ముఁడవు. ఇట్లొనర్చుట తగునా?"
అక్క యీ రీతిగా నీతి ప్రేమలు గలుగ ఆనతీయగా, అశుచియై బక్కచిక్కినవాఁడు గావున, నిగమశర్మ అన్న పానములమీఁది కోర్కెచే నామె యొనర్చిన హితోపదేశము నాదరించినాఁడు. తేనె పూసిన కత్తి వంటి బ్రాహ్మణుఁడైన నిగమశర్మ దివాణమునకు రాకపోకలు చేయుచున్నాఁడు. మరచిన చదువులును మరలఁ జదువుచున్నాడు. పూర్వపు చెలికాండ్రెదురైన తల వంచుచున్నాఁడు. ధర్మపత్ని నూరడించుచున్నాడు. గురుజనులను బ్రతిదినమును గౌరవించుచున్నాఁడు. దేవతావిగ్రహములకు నైవేద్యములు వెట్టుచున్నాఁడు. అపరాహమున వచ్చిన అతిథి సముదాయములనుఁ బూజించు చున్నాఁడు. పనుల మందను గాపాడుట, పైరు పచ్చలను జూచివచ్చుట లొనర్చుచున్నాఁడు. తండ్రి దోవతిని తానే యుదుకుచున్నాఁడు. అక్క పెనిమిటితో చిఱునవ్వుల నెమ్మదిగఁ జిలుకరించుచున్నాఁడు. అంగడికి వచ్చి గ్రామకార్యమును దీర్చుచున్నాఁడు.
నిగమశర్మను దొంగలు దోచుకొనుట
నిగమశర్మ యీ రీతిగా సన్మార్గునివలెఁ గొంతకాలము గడపిన పిదప, నొకనాఁడు ఇంటియందున్న సొమ్ములనన్నిటి నేరి మూటఁ గట్టుకొని కాజేసి, రాత్రివేళ తాను పండుకొన్న పడకకును చెప్పక కాఱుచీఁకటియే తనకు తోడుగా మహారణ్యమధ్యమునఁ
786
వావిలాల సోమయాజులు సాహిత్యం-4