Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/782

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అపహరించును. తండ్రి కితరులు వ్రాసి యిచ్చిన ఋణ పత్రములను దొంగిలించుకొనిపోయి వచ్చినంతకు అమ్మఁ జూపును. మృత్యురూపములైన సాహుకారుల యొద్ద పెద్ద వడ్డీకి (చక్రవడ్డీకి) ఋణములు చేయును. మాన్యములు, వృత్తిచేలు, ధాన్యము, గుత్తకుఁ దీసికొనిన పొలములు, పాతఱలు - అన్నింటిని జనుల కమ్మఁ జూపును. స్వేచ్ఛగా విహరించు నా నిగమశర్మ ముందేమి కానున్నాడో! కళింగ (దేశ)మునఁ బుట్టినవాఁడగుట వలననో ఏమో, అందఱును వ్రేలు పెట్టి చూపి నిందించుచుండగా కొంచెమైనను జంకక, యోగ్యుల మర్యాదకు దూరమైనవాఁడై యున్నాఁడు. (కళింగము - పుచ్చతీగ - కళింగోద్భవము - పుచ్చతీగయందుఁ బుట్టినది - పుచ్చకాయ. ఇది వేలు పెట్టి చూపినను మఱిగిపోదు) అంతేకాక యోగ్యుల మర్యాదకు ఇతఁడు దూరుఁడైనాఁడు. (పుచ్చకాయ నిషిద్ధవస్తువు. శిష్టులు దాని ముట్టుకొనరు - కళింగదేశీయులు అనాచారపరులని ప్రాచీనుల యభిప్రాయము).

దొరికిన చోటులం దెల్ల నప్పులు తీసి తీసి దివాణమునందు, బంధువుల యొద్ద యాచన చేసి, కూడు కూటములపై నాసక్తికి హద్దు నెఱుఁగక, బ్రాహ్మణుఁడైన యా నిగమశర్మ తిరుగుచుండెను.

తన మిత్రుల యిండ్లలో చెడు త్రాగుడులు త్రాగుచు, ఇంటికి వెళ్ళక జూదమున సంపాదించినదియు, దొంగతనము వలన చేకూరినదియు, అబద్ధములాడి పొందినదియునగు ధనములను పిసాళి వెచ్చములకు వ్యయ మొనర్చుచు, తన పూర్వ వైభవము నంతటిని కోలుపోయి నిగమశర్మ మిక్కిలి చులుకన యయ్యెను. గడువు దాటుటచే నప్పులవారు బాధింపఁగా గ్రామమున బ్రవేశింపక పైపైననే తిరుగు చుండెడివాఁడు. సమయమునందు కూడు లభింపక పోవుటచే నాకలి వలన గువ్వ గొంతువంటి హీనస్వరముతో నతఁడు బాధపడుచుండెడివాఁడు. అతఁడు వస్త్రమునకు, కూటికి నీచులను వేడుటకై మొండి చొరవ చేసికొని, పట్టణమంతయు నవ్వఁగ గౌరవదూరుఁడై పువ్వులు ముడిచిన యంగళ్ళయందే వీడెల్ల నవ్వునట్లు కట్టెలను మోసినాఁడు. దుశ్శీలరతుఁడైన అతనియక్క యొకతె మూర్ఖుఁడగు నాతని శిక్షించెదనని తన మగనిని, బాలురనుఁ గొని పుట్టినింటికి వచ్చినది.

నిగమశర్మ అక్క నీతులుపదేశించుట

నిగమశర్మ యక్క ఐదారు యోజనముల దూర మందున్న తన యూరినుండి వచ్చి తండ్రి యింట కొన్ని ప్రొద్దులు గడిపినది. కుమారుని దుర్వర్తనమునకు 782 వావిలాల సోమయాజులు సాహిత్యం-4