Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/781

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వాసన వెదజల్లు వస్త్రపు చెంగు నేలఁ జీరాడునట్లు కట్టెడివాఁడు. తాంబూలరాగము చే నొప్పు నీతని పెదవు లెప్పుడును దంతక్షతములచే నావరింపబడి యుండెడివి. అట్లె యతని కంఠము నఖక్షతములతో నలరారుచుండెడిది. తన వెంట నెల్లవేళల చెలికాండ్రును, పరిహాసకులును కలిసిరాగా నిగమశర్మ రాజమార్గమున ఠీవిమెఱసి తిరుగుచుండెడివాఁడు. యువతులు ననుభవించుటచే (లేదా యువతు లనుభవించుటచే) నితఁడు మలినమైన వస్త్రమును ధరించుటకు ఏ మాత్రమును సిగ్గువడెడివాఁడు కాఁడు. ఈ నిగమశర్మ జాతిమాత్రోపజీవి. ఈతనికి భార్య పాలిండ్లు రిక్తకుంభములు. వేశ్యచనుదోయి నిండుకుండలు. కులవధువు నుదురు చవితినాటి చంద్రుడు (చూడం దగనిది). వేశ్యఫాలము ప్రతిపదిందుఁడు (పాడ్యమినాఁటి చంద్రుఁడు - పరికించి చూడఁదగినది). ఇతఁడు ఉపున హోమాగ్ని నూదుట కిష్టపడఁడు గాని నిరంతరము విరహార్తిచే వేడి నిట్టూర్పులు విడుచుచుండును. సంధ్యాదేవికి ప్రార్థనాంజలి పట్టఁడు గాని తనపై కోపగించిన కాంతల కాళ్ళకు ప్రీతితో మ్రొక్కుచుండును. శంఖమున బోయఁబడిన నీరమును (శంఖతీర్థమును) పుచ్చుకొనఁలేడు. కాని వారవనితల అధరామృతమును మాత్రము తప్పక త్రాగుచుండెను. శరీరమున తిరుమణి, తిరుచూర్ణాదులైన పుణ్యచిహ్నములను ధరించుటకు సిగ్గు పడును గాని, వేశ్యలర్పించిన నఖక్షతములను తాల్చుటకు ఏ మాత్రము సిగ్గుపడెడివాఁడుకాఁడు. ఈ రీతిగ చెడునడతలు గల యా పోకిరి దుర్విలాసముల కిష్టపడుచుండెను. వ్యర్థముగ జందెము ధరించినవాఁడైన ఈ బ్రాహ్మణబ్రువుఁడు నిగమశర్మయను పేరు నేతిబీరకాయ వలెనబద్ధపు కథ కాగా పురమునందు విచ్చలవిడిగా విహరించుచుండెను.

నిగమశర్మ దుర్వ్యసనములు

పురమునం దీ రీతిగ నిగమశర్మ విహరించుట యెఱిఁగి తల్లిదండ్రులు వానిని శిక్షింప నారంభించిరి. అందువలన నతఁడు తన వ్యసనమును మానక మఱింత దిట్టయై, గడ్డిపోచ యంతైన చాటు మాని నిర్భయముగఁ దిరుగ నారంభించి, గృహమునందున్న ధనమునంతటిని వ్యయ మ నర్చుచున్నాఁడు. తరతరములుగా తాతముత్తాతలు, తండ్రి చీమవలెఁ గూఁడబెట్టిన ధనమంతయును అతని చేతికిఁ జిక్కి పాము కఱచినవాని శరీరమందలి నెత్తురు వలె నశించెను. ప్రతిదినమును జేయు చిల్లర వ్యయమునకై నిగమశర్మ తన శరీరము మీఁది సొమ్ముల నన్నింటిని కోమటియింటఁ గుదువఁబెట్టును. మెలమెల్లగాఁ దల్లినిఁ జేరి యీఁతచెట్టును మద్యమునకై గీచినట్టు కొంచెము కొంచెముగా తల్లి శరీరముపై బంగారము నంతటిని


సాహిత్య విమర్శ

781