ఈ పుట అచ్చుదిద్దబడ్డది
నాహ్వానించినను సామమంత్రములు శ్రుతిపుటములఁ బడునంతకు దేవతలు
యజ్ఞభాగములనైన గ్రహింపఁ బయల్వెడలరఁట! ఇట్టి దేవతల స్తుతించుట కాదిద్రష్టలు
పలికిన ప్రపాఠములు చాలక, స్తోత్రహిత బుద్ధులైన కవు లెన్నెన్ని స్తుతులు
గల్పించినదియు స్తోత్రరత్నాకరములఁ బరిశీలించిన సువ్యక్తము కాఁగలదు. అయ్యు
వీనిఁగని బ్రహ్మ మేకము కాదనుకొనుట యద్వైతు లంగీకరింపనిది. 'ఏక మే
వాద్వితీయమ్ బ్రహ్మ' స్తోత్రపాఠ మొక లీల! ఒక చిదంబర రహస్యము!!
____________________________________________________________________________________________________
78
వావిలాల సోమయాజులు సాహిత్యం-4