సదాచార సంపత్తిగల బ్రాహ్మణకుటుంబమునఁ బుట్టిన నిగమశర్మ కామమునకు లొంగి సర్వభ్రష్టుఁడై, సంపదను, వంశమును గోల్పోయి మిత్రద్రోహియై, తుదకు బోయలలోఁ గలిసి, మాలపడుచును వివాహమాడి సంతానమును గని, యామయు సంతానమును అగ్నిచే దగ్ధమై మృతి నొంద విలపించి, మతిచెడి, ఆహారనిద్రల మాని తుదకు శ్రీనృసింహక్షేత్రమును బ్రవేశించి ప్రాణములు విడిచినాఁడు. యమభటులు పెట్టు చెఱలకు దాళజాలక నిగమశర్మ గట్టిగ నరువఁగా విష్ణుచక్రము వారిని తఱిమి, నిగమశర్మ బంధనములను ద్రెంచివైచినది. అంతట విష్ణుదూతలు వచ్చి యతని శ్వేతద్వీపమందలి పరమపదమునకు గొనిపోయిరి. అట నిగమశర్మ విష్ణుసాయుజ్య మొందినాఁడు.
పాండురంగ మాహాత్మ్యము క్షేత్రమాహాత్మ్యము. క్షేత్రమాహాత్మ్యములందలి కథలలోని పరమార్థము ఎట్టి దురాచారవంతుఁడైనను, ఎన్ని పాపములొనర్చినను, ఎన్ని ఘోరములు చేసినను భగవంతుఁడు ప్రసన్నమైనచో, వానికి మోక్షము లభించుననుట. నిగమశర్మోపాఖ్యానము నందు దానికి మించిన సిద్ధాంతమున్నది. ఇందు శరీరపతనవేళ తాత్కాలికముగనైన భగవద్బుద్ధి లేదు. స్థలము, మరణకాలము, అచటి దేవతామాహాత్మ్యము సన్నిహితములై యుండుటచేత, యాదృచ్ఛికముగా జరిగిన యొక క్రియ భగవత్సేవగా పరిణమించుటచే, నిగమశర్మకు భగవత్సన్నిధానము చేకూరినది.
మనోవాక్కాయ కర్మల సంపుటి యుత్తమభక్తి లక్షణము. ఇట్టి యుత్తమభక్తితో నిగమశర్మ కెట్టి సంబంధమును లేదు. నిగమశర్మ కథ కేవలము పాండురంగ క్షేత్రమాహాత్మ్యార్థమును మాత్రమే నిరూపించుచున్నది. “ఆంధ్రభాషాసారస్వతమునందలి ప్రబంధము..... పాండురంగ మాహాత్మ్యము. ప్రౌఢశైలీనిర్మాణ నైపుణ్యముచే కైలాసశిఖరము వంటి పాండురంగ మాహాత్మ్య కథాహారమునకు నిగమశర్మోపాఖ్యానము నాయకమణి."
నిగమశర్మోపాఖ్యానము - సంఘవృత్తము
నిగమశర్మోపాఖ్యానమునకు నాయకుఁడైన నిగమశర్మ ప్రబంధనాయకులలో నొకఁడైన అవతారపురుషుఁడు గాని, మహారాజుగాని కాఁడు. సంఘమున నొక సంపన్న శ్రోత్రియకుటుంబమున జన్మించినవాఁడు. వేదాధ్యయనము నొనర్చినవాఁడు. సాహిత్య విమర్శ 769 Rh{|rule|} Rh{|సాహిత్య విమర్శ|769|}