మాహాత్మ్యమున శివప్రశంస యెందువచ్చినను కవియొక్క యూహావైభవ మంతయు గన్పించును" (శ్రీ విశ్వనాథ). ఇవియన్నియు రామకృష్ణకవి వైష్ణవమును స్వీకరించినవాఁడుగా ధ్రువపరచును. ఈ సందర్భము నొక విమర్శకుఁడు "పిట్టగూడు విడిచి యెంత దవ్వేగినను తన గూటిమీఁదనే యొక కన్నుంచు నన్న విధమున వైష్ణవమత నవలంబించినప్పటికిని సహజమైన యీశ్వరభక్తి వీడలే" దని చెప్పినారు (శ్రీ నూరిగూచ్చి కృష్ణమూర్తి - భారతి క్రోధన - ఆశ్వయుజము).
పాండురంగ మాహాత్మ్యము : నిగమశర్మోపాఖ్యానము
పాండురంగ మాహాత్మ్యము మనుచరిత్ర, పారిజాతాపహరణముల వలెఁ గాక మొదటినుండియు చివరవఱకును నొక పద్ధతిలోనే హృదయంగమముగ సాగినది. రమ్యములైన కథలు, వర్ణనలు అన్ని యాశ్వాసములందును నున్నవి. "మొదటి యాశ్వాసమున అగస్త్యముని, కుమార వృత్తాంతములును, ద్వితీయాశ్వాసమున నిగమశర్మోపాఖ్యాన, రాధికావృత్తాంతాదికమును, చతుర్థాశ్వాసమున రాధాతపశ్చరణ, సుశీలాదివృత్తాంతములును, ఐదవ యాశ్వాసమున సుశర్మోపాఖ్యానము, అయుతనియుత వృత్తాంతము చాలా చక్కగఁ గూర్పఁబడినవి. ప్రతివృత్తాంతమున నొక ప్రత్యేకత యున్నది. కొన్ని విషయములు చర్వితచర్వణములే యైనను క్రొత్తఁదనము కలిగి, పాఠకులకు విసువు కల్గింపక ఆసక్తినే కూర్చుచుండును.” (శ్రీ బులుసు)
శ్రీకృష్ణరాయల యుగమునఁ బుట్టిన ఆముక్తమాల్యద, పాండురంగ మాహాత్మ్యము ప్రౌఢప్రబంధములు, శ్రీకాళహస్తి మాహాత్మ్యము మధురకావ్యము. ఆముక్తమాల్యద, కాళహస్తి మాహాత్మ్య, పాండురంగమాహాత్మ్య కావ్యములు భక్తిప్రధానములు. భక్తిభావప్రతిపాదకములైన ఈ కావ్యములు బహుకథా సమ్మిళితములు. పాండురంగమాహాత్మ్యము, శ్రీనాథుని కాశీఖండ, భీమఖండములు వలెను, ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్మ్యమువలెను క్షేత్ర మాహాత్మ్యము.
“తెనాలి రామకృష్ణకవి ప్రతిష్ఠ సంపూర్ణముగా నతని పాండురంగ మాహాత్మ్యము మీఁద నాధారపడియున్నది. పలుమంది పెద్దన్నగారి మనుచరిత్రను సంపూర్ణముగా చదువునట్లే పాండురంగ మాహాత్మ్యము కూడా సంపూర్ణముగా చదువరు. కాని నిగమశర్మోపాఖ్యానము, అయుతనియతోపాఖ్యానము ప్రధానముగ చదువుదురు. ఈ రెండు కథలు తెనాలి కవి కవితకు మచ్చుతునకలు. అతని క్రొత్త పలుకుబడి, సర్వవైభవము నీ రెండు కథలయందు సంపూర్ణముగా నున్నది.” (శ్రీ విశ్వనాథ ) 768 వావిలాల సోమయాజులు సాహిత్యం-4
768
వావిలాల సోమయాజులు సాహిత్యం-4