కంకితమిచ్చినాఁడు. గోపమంత్రి శ్రీకృష్ణరాయల శిరఃప్రధానియైన సాళువ తిమ్మరుసు మేనల్లుఁడు. శ్రీకృష్ణరాయలు క్రీ.శ. 1515లో కొండవీటి దుర్గమును జయించిన పిదప, తిమ్మరుసు తన మేనల్లుఁడైన గోపమంత్రిని దానికి పాలకునిగా నియ మించినాఁడు. క్రీ.శ. 1517లో గోపమంత్రి దేచమంత్రి కొక యగ్రహారమును దానమొనర్చినాఁడు. దేచమంత్రి శైవాచారసంపన్నుఁడు. లొల్ల లక్ష్మీధర పండితుని యనుగ్రహమున శివపంచస్తవికి వ్యాఖ్య వ్రాసినవాఁడు. రామలింగకవి తన ఉద్భటారాధ్యచరిత్రను క్రీ.శ. 1535 ప్రాంతమున దేచమంత్రి కంకితమచ్చి యుండును. పాండురంగమాహాత్మ్య కృతిపతి విరూరి వేదాద్రి మంత్రి కందాళ అప్పలాచార్య శిష్యుఁడు. ఈ కందాళ అప్పలాచార్యులకు గండికోట ప్రభువు క్రీ.శ. 1582న భూదాన మొసఁగినాఁడు. రామకృష్ణకవి పాండురంగ మాహాత్మ్యమున తన వైష్ణవగురువును "భట్టరు చిక్కాచార్యుఁ" డని పేర్కొనినాఁడు. పెదసంగ భూపాలుని మేనల్లుఁడు, కొండ్రాజు తిమ్మరాజు కుమారుఁడు అయిన వేంకటాద్రియును చిక్కాచార్యుల శిష్యుఁడు. వేంకటాద్రి క్రీ.శ. 1584లో కామందకమును కృతి నొందినాఁడు. దీనినిబట్టి తెనాలి రామకృష్ణకవి క్రీ.శ. 1565 ప్రాంతమున పాండురంగ మాహాత్మ్యమును జెప్పినట్లుగ నూహింపవచ్చును. పాండురంగ మాహాత్మ్యమున వసుచరిత్ర (ఆ 4 ప 242), ఆముక్తమాల్యద (ఆ 4 ప 242) సూచింపబడినవి. ఆముక్తమాల్యదకుఁ బిమ్మట పుట్టిన వసుచరిత్రయును క్రీ.శ. 1569-70 ప్రాంతమున పుట్టినది. రామకృష్ణకవి అష్టదిగ్గజములలో నొకఁడై శ్రీకృష్ణదేవరాయల యాస్థానమున నుండుట కవకాశమున్నది. కనుక నీ కవివర్యుఁడు క్రీ.శ. 1505 ప్రాంతమున జన్మించి క్రీ.శ. 1575-80 వఱకు జీవించి యుండునని నిర్ణయింపవచ్చును.
రామకృష్ణుని మతము
రామకృష్ణకవి పాండురంగ మాహాత్మ్యము వైష్ణవపరమైన గ్రంథము. అయినను కవి జన్మతః శైవుఁడై బహుకాలము శైవుఁడుగ వర్తించి, శైవమును వలచి ఉద్భటారాధ్య చరిత్రాది గ్రంథములు చెప్పినవాఁడగుట వలన, పాండురంగమాహాత్మ్యమందును శైవము విశేషముగఁ గన్పట్టుచున్నది. జన్మతః వైష్ణవుఁడైన రాయలు ఆముక్తమాల్యద గ్రంథావతారికయందు నిత్యముక్తుల స్తుతులు మాత్రమే యుండఁగా, తెచ్చుకొన్న వైష్ణవము గల రామకృష్ణకవి పాండురంగమాహాత్మ్యమున శివస్తుతి, పార్వతీస్తుతి యున్న “ఈ చివురాకు నీ ప్రసవ మీ పువుదేనియ యెంత యొప్పెడున్" - అను పద్యమునందు విశ్వనాథ యన్నట్లు శివభక్తి కే మాత్రము కొదువలేదు. "పాండురంగ
సాహిత్య విమర్శ
767