Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/763

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాటకరంగమున నిట్టి సూచనలనందుకొని జరుగకపోవుట వలననే నాటకకళకు నేఁడు దుఃస్థితి పట్టినది. ఉద్ధరణను గూర్చి వ్యర్థప్రచారములో గాని, జరుగుచున్న పని అల్పము. ఏ నాఁటికైన నాటకకళను ఉద్ధరించి పోషింపదలచినచో, నపుడైన శ్రీ పింగళి వారి సూచనలను అనుసరించుట తప్పదు. ఈ పింగళి విమర్శ కళారంగ మందును జిజ్ఞాసాత్మకము, సమన్వయమార్గానుసారిణి, ఉత్తమత్వదృష్టి గలది; కళాతత్త్వ విజ్ఞతతో నొప్పినది.


సాహిత్య విమర్శ

763