ధనికుల కడకు స్తోత్రపాఠకులై వెడలు వారీ రహస్యమును మున్నె గుర్తించి తగినరీతి
వర్తించి రసవంతముగఁ దప్పించుకొని వత్తురు.
127[1]గడచిన ప్రపంచ మహా యుద్ధమునఁ బ్రథమ నష్టము సత్యమని మహాత్ముఁడు ప్రవచించినాఁడు. అయిన నేమి? ప్రపంచ మే కడ మాఱినది. ఎవరి ప్రచారము వారిది. ప్రచారము లేకున్న బలప్రాభవము లుండవు బ్రతుకుట కష్టము. అసత్యమున కింతటి ప్రాపకమున్న యీ దినములలో మహాత్ముని వంటి కారణజన్ములు మఱల నవతరించి స్తుతిపాఠము జాతి విద్రోహము, దేశ విద్రోహ మని ప్రకటించి యందులకై బ్రచార మొనర్చి యెన్ని వ్యక్తి సత్యాగ్రహములు సాగించినను నీ నాణెమునకుఁ గల చలామణినిఁ జెఱిపి వేయలేరు. ఇది మహత్తర సత్యము. భూతవర్తమానములు దీని చెల్లుబాటు కన్పించుచున్నది. భవిష్యత్తున నొకవేళ రూపాంతరమును బొందినఁ బొందవచ్చును. కాని నశించు ననుకొనుట భ్రమ. దీనిని కేవలము బానిస యుగ చిహ్నముగఁ బరిగణించి భావికాలమున మన ప్రజాగణతంత్ర రాష్ట్రమున సమూలముగ నిది పరిభ్రష్టమగు ననుకొనుచున్న వారు భ్రమప్రమాదమునకు లోనైనారని ఘంటాపథముగఁ బలుకవచ్చును.
లోకమున గొందఱకు స్తోత్రపాఠ మనిన గిట్టదని వినుచుందుము. కుశాగ్ర బుద్ధితో నాలోచింప నిది గగనకుసుమమని యవగతమగుచున్నది. అట్టివారి జీవిత 128[2]' వ్యాసఘట్టము' లెఱిఁగి ముగ్గున కెట్లు దింపవలయునో సిద్ధహస్తులైన 129[3] కారంధమ 'స్తోత్ర పాఠకు' లెఱుఁగుదురు. స్తుతిపాఠ మనిన నాకిష్టము లేదని ప్రకటించు వ్యక్తి భంగ్యంతరముగ నద్దాని నభిలషించుచున్నాఁడన్నమాట! అతగాని దర్శన మొనర్చి జగజెట్టి స్తోత్రపాఠకుఁ 130[4]'డడియఁడై' ద్రావిడ ప్రాణాయామముగ 'మహాప్రభో! 131[5]నభోగాయకులందఱకువలెఁ దమకు స్తోత్రపాఠ మనిన సుతరమును గిట్టదు. దానికిని మీకును ధ్రువముల రెంటికున్నంత దూరము, తాము కేవలము 'స్తోత్రపాఠ వరూథినీప్రవరు'! లని నాతిదీర్ఘ బిరుదమును ప్రసాదించి పని నెగ్గించుకొని మఱి బయటఁబడ గలఁడు. అనిన స్తుతిపాఠ మనిన నేవగింపును బ్రకటించువారికి నేఁటి విధానము సంతృప్తినొసఁగుట లేదన్నమాట! వారు కాంక్షించుచున్నది నవ్యత. అది పొడకట్టిన మఱుక్షణముననే వారు 132[6]'త్రిశరణములఁ జెప్పి తీఱెదరు.
మూర్ఖుఁడు స్వగృహపూజ్యుఁడు కనుక తన్నుఁ దానె పొగడుకొనును. వివేకి సహచరుల స్తుతించును. అంతటివారికి మిత్రుఁడనైన నే నెంతటివాఁడనో గ్రహింపుఁ
డనుట కింతటి కంటె 'శృంగగ్రాహిక' యింకేమి కావలయును? ఒకప్పుడు వేత్తలును- ↑ 127. గడచిన ప్రపంచ మహాయుద్ధమున “The first casuality of war is truth” - Mahatma
- ↑ 128. వ్యాసఘట్టము - వ్యాసుఁడే మఱలవచ్చి వివరింపవలసిన గ్రంథగ్రంథి.
- ↑ 129. కారంధమ = కంచు
- ↑ 130. అడియఁడు = అడియేన్ దాసన్ (నేను నీ సేవకుఁడ) అనువాఁడు
- ↑ 131. నభోగాయ = భోగరహితుఁడు, తిట్టు.
- ↑ 132. త్రిశరణములు = బౌద్ధులు చెప్పు “సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి" అనునవి
____________________________________________________________________________________________________
76
వావిలాల సోమయాజులు సాహిత్యం-4