ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అధఃసూచిక
1. శాంతయ్య ఇంటిపేరు డాక్టరు రామరాజుగారికి లభ్యమైన ప్రతిలో "ఉప్పల” వారని యున్నది. ఇది "ఉత్పల” శబ్దమునకు వికృతియనియు, నిదియే శాంతయ్య యింటి పేరనియు శ్రీ రామరాజుగారు భావించుచున్నారు. ఇది తొలుత నాలుగాశ్వాసములు మాత్రమే లభింపగా శ్రీ కట్టి సాంబమూర్తి గారి పరిష్కరణతో ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు దీనిని ముద్రించినారు. పిమ్మట నైదవ యాశ్వాసముతో పూర్ణముగ లభించిన ప్రతిని పరిష్కరించి, శ్రీ డాక్టరు బి. రామరాజుగారు ఆంధ్ర సారస్వత పరిషత్పక్షమున దీనిని ముద్రించినారు. శ్రీ రామరాజు గారికి లభించినది సమగ్రప్రతి. పూర్వము ముద్రితములైన నాలుగాశ్వాసములలోని శిథిలభాగములు భద్రముగా నుండుటయు, అయిదవ యాశ్వాసముతో నొప్పుటయు దీని ప్రత్యేకత.
సాహిత్య విమర్శ
757