Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/755

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రబంధము వర్ణనప్రధానము. ఈ లక్షణమున కనుగుణముగనే సుకుమార చరిత్రము నందలి ద్వితీయాశ్వాసమున రత్నపురవర్ణనము, ఓంకార నాథవర్ణనము. హేమాంగద రాజవర్ణనము, సుశీలాదేవి వంధ్యాత్వ వర్ణనము, సుకుమారోదయ వర్ణనము మొదలైన వానినెల్ల ప్రౌఢ ప్రబంధమార్గము ననుసరించి వర్ణించినాఁడు. ఇందలి రత్నపురవర్ణనము తఱువాతి కాలమునఁ బుట్టిన ప్రబంధములలోని ఏ పుర వర్ణనమునకైన మూలమనఁదగినంతగ భాషాభావములు విషయములు రెంటను ప్రౌఢముగ నడిచినది. ఈ వర్ణనలెల్ల రసోచితములై యొప్పినవి.

శ్రీనాథుఁ డెంతటి శైవాత్ముఁడో అంతటి శృంగారరసప్రియుఁడు. యజ్ఞ దత్తామాత్యుని యింట జరిగిన సీమంత పుంసవనోత్సవములకు పంచారామ లీలావతులు వచ్చినట్టుగాఁ జెప్పిన “ఆదన స్వచ్చిరి సంభ్రమంబునను పంచారామ లీలావతులొ” ఇత్యాదికి కారణ మీ శృంగారరసప్రియత్వమే. సుశీలాదేవి గర్భచిహ్నములు “జహదజహత్సమగ్ర పురుషాయితకేళి విజృంభణంబులై విలసిల్లినట్లు చెప్పుటయును, “పంచారామ విలాసినీ ధవళదృక్పాఠిన జాలాయమానాంచత్కారు” నిగ సుకుమారుని వర్ణించుటయును నీ శృంగారరసప్రియత్వము వలననే.

మ.

"చెవికిం గేలివతంసకోత్పలదళశ్రీలై కపోలంబులన్
నవకాలాగరుపత్ర రేఖలయి మేనం గమ్మకస్తూరి యై
ధవళాంభోరుహనేత్రపైఁ గురిసె నుద్యల్లీల సీమంతపుం
సవనాజ్యాహుతిహోమ సంప్రభవ చంచద్వహ్ని ధూమచ్ఛటల్.”

అన్న సీమంతోత్సవ వర్ణనయందలి పద్యము శ్రీనాథమహాకవికి గల మనోజ్ఞమైన సౌందర్యదృష్టికి, నిశితభావనాబలమునకు (Power of imagination) నిదర్శనము. సుకుమారుఁడు బాల్యమున కక్ష్యావిభాగములను దాటువేళ నున్న తెరువును వర్ణించుచుఁ జెప్పిన “వలిచన్నుల్ వడఁకాడ" ఇత్యాది వర్ణనకును నీ సౌందర్యదృష్టియే హేతువు. ఈ గుణవిశేషమును బట్టియే మొల్ల శ్రీనాథుని “రసికుఁడైనట్టి శ్రీనాథు” అని ప్రశంసించినది. సుకుమారుని బాల్యముననే "పేరురమునందు ధరించిన దైత్యు కైవడిగా (ప. 78) వర్ణించుట యాతని భావికాల దౌష్ట్యమును వెల్లడించుటకే.

ప్రబంధకవులకు వర్ణనప్రియత్వముతోఁ బాటుగ నలంకార ప్రియత్వము నొక లక్షణము. పురాణకవులు, ఉపమ, రూపకములవంటి సామాన్యాలంకారములతోఁ గవిత చెప్పెదరు. ప్రబంధకవులకు ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, భ్రాంతిమంతము,


సాహిత్య విమర్శ

755