గ్రంథభాగములను ఎట్లు ఆయా సందర్భముల ననువదించినాఁడో తెలియుటకు చూ. శ్రీనాథుని కవితావిశేషములు.]
నలుని మంత్రి సుమతియైయుండ దమనకుఁడనుట (ఆ౨.౧౫), దశరథుఁడు దిగ్గజంబులఁబోలిన కుమారుల నల్వుర అనుచోట (ఆ౨. 39 ) దిగ్గజములు ఎనిమిదైయుండ నల్వురనుట, సచివు భార్యను పట్టపుదేవి యనుట (ఆ౨.౫౧), యజ్ఞదత్తుని భార్యకుఁ జేయవలసిన సీమంతోన్నయనము హేమంగదరాజు మంత్రిచే చేయించుట మొదలగు స్వల్పదోషములు గలవని యొకరు చూపిన దోషములు బాగుగఁ బరికింప, దోషములు గావనియును నిరూపించు నవకాశమున్నది.
ఈ రీతిగ శ్రీనాథమహాకవి ప్రబంధకావ్యత్వములను సంపాదించుచు అల్పమైన ఈశాన సంహితాకథను మనోజ్ఞవర్ణనాదికముతోఁ బెంచి, ప్రౌఢ సాహిత్యస్ఫూర్తితో శివరాత్రి మాహాత్మ్యమను ప్రబంధ పూర్వయుగమునఁ బుట్టిన యొక కావ్యరత్నముగఁ దీర్చిదిద్దినాఁడు. "శ్రీనాథుని తనము” ఇందు సర్వత్ర గోచరించుచు, కథకు సంబంధము లేకున్నను స్వతంత్ర ముక్తకములుగా నిలువఁదగిన శ్రీనాథముద్రగల పద్యము లిందు ఎన్నియో యున్నవి.
శ్రీనాథుని కవితావిశేషములు
సీ. "సంస్కృత ప్రాకృత శౌరసేనీముఖ్య
భాషాపరిజ్ఞాన పాటవంబు,
పన్నగపతిసార్వభౌమ భాషిత మహా
భాష్య విద్యాసమభ్యాస బలము,
నక్షపాద కణాద పక్షిలోదీరిత
న్యాయకళాకౌశలాతిశయము,
శ్రుతిపురాణాగమస్మృతి సాంఖ్య సిద్ధాంత
కబళనవ్యుత్పత్తి గౌరవంబు
తే. పూర్వకవిముఖ్యవిరచితా పూర్వకావ్య
భావరససుధాచర్వణ ప్రౌఢత”
గలిగిన విద్వత్కవియని సమకాలికుఁడైన దుగ్గన కవివర్యుచేఁ గొనియాడఁ బడినవాఁడు, "సకల విద్యాసనాథు" డైన శ్రీనాథకవిసార్వభౌముఁడు. ప్రౌఢ సాహిత్య నిర్మాత. ప్రబంధయుగ సూర్యోదయమున కరుణోదయమును గల్పించిన “పూర్వ
752
వావిలాల సోమయాజులు సాహిత్యం-4