Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/750

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పుష్పవాటికలోని పూలుగోసి తన “ప్రియ పుత్రిక"లకుఁ గొనిపోవుటకై నాగేశ్వరుని గుడికి వచ్చుట, ఆ గుడియందు జరుగు శివరాత్రి పుణ్యకలాపమును అర్ధరాత్రివరకును దర్శించి, ఇంటికేఁగి పిమ్మట కొంతకాలమునకుఁ జచ్చుట, శివరాత్రి జాగరణ, పుణ్యవ్రతావలోకన పుణ్యముతోఁ జచ్చిన పరమపాపియగు అతని నే లోకమునఁ జేర్చుటయను విషయమునుగూర్చి యమభటులు, ప్రమథులు వాదోపవాదము లొనర్చి రణము గావించుట, యమభటు లోడుట, శివలోకమును జేరిన సుకుమారుఁడు శివుని స్తుతించి కామగమనము, రుద్రకన్యాసహస్ర కలితమైన దివ్యవిమానమును, ప్రమథత్వమును పొందుటలతో చతుర్థాశ్వాసము ముగియును.

సుకుమారుని గూర్చి తన భటులకు ప్రమథులకు నైన యుద్ధమున తన భటు లోడుటను గూర్చి చిత్రగుప్తునితో యముఁడు సంప్రదించుట, "తన యశక్త్యాధికారము శివునకే విన్నవింప నిశ్చయించుకొని కైలాసమున కేగుట, కైలాస వర్ణనము, శివసందర్శనము, శివస్తుతి, యముఁడు సుకుమారుని పాపకార్యములను శివున కెఱిగించుట, శివుఁడు యమునకు శివరాత్రి మాహాత్మ్యము, శివభక్తుల లక్షణములను జెప్పుట, యముఁడు తన లోకమునకుఁ దిరిగివచ్చి తన భటులకు శివరాత్రి మాహాత్మ్యమును, శివభక్తుల లక్షణములు మరలఁ జెప్పుటతో పంచమాశ్వాసము ముగియుచున్నది.”

శివరాత్రి మాహాత్మ్యమునందలి ఐదాశ్వాసముల కథకును స్కాంద పురాణాంతర్గతమైన "ఈశాన సంహిత" లోని నూఱుశ్లోకములు శ్రీనాథునకు తొలిమూలము. ఈ నూఱుశ్లోకము లాధారముగాఁ గొని కవికుల గురుస్థానము, కల్పవృక్షము నైన బాణుని కాదంబరిలోని వర్ణన లాధారముగ గ్రహించి, శ్రీనాథుఁడు ఇంత పెద్ద గ్రంథమును రచించినాఁడు. తొలియాశ్వాసమునకుఁ బిమ్మటి కథయైన సుకుమారచరిత్ర పరిమిత కథావస్తువు గలది. కావున దీనిని ఈ శివరాత్రి మాహాత్మ్యమును] శ్రీనాథకవిసార్వభౌముఁడు సకల ప్రబంధ లక్షణ సమన్వితము గావింపఁదలఁచినాఁడు." [శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రి] తనకుఁ బ్రియమైన సౌందర్యదృష్టిని ప్రసరించుటకు, శృంగార రసప్రపంచనము (విస్తరించుటకు) నొనర్చుటకు, వర్ణనాత్మక ప్రౌఢసాహిత్య సౌరభములను వెదజల్లుటకు, శివశక్తి నిరూపణము, ఈశ్వరార్చన కళాశీలమును కనులఁ గట్టించుటకు నిది యోగ్యమైన కథావస్తువుగ శ్రీనాథునకుఁ దోఁచినది. అందుచే నిందు శ్రీనాథమహాకవి తన ప్రౌఢ కవితావిన్యాసములను రసికజనానందకరముగ విన్యసించినాఁడు. లేఖనికజనిత ప్రమాదాదులు కొన్ని యున్నను, కొందఱు భావించినట్లిది శ్రీనాథకవి సార్వభౌముని


750

వావిలాల సోమయాజులు సాహిత్యం-4