Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/747

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శివరాత్రి మాహాత్యము

“శివరాత్రి మాహాత్మ్య” మను ఆంధ్ర ప్రబంధము శ్రీనాథ మహాకవి శ్రీశైలమందలి యొక శైవపీఠమున కధిపతియైన శ్రీ శాంతభిక్షావృత్తి యతివర్యుని కోర్కెపై, నాతని మూలభృత్యుఁడైన ఉప్పలపు - (పువ్వుల) ముమ్మడి దేవయ్య శాంతయ్య కంకితముగఁ జెప్పిన కృతి. ఇది ఐదాశ్వాసములు కావ్యము. దీనికి మూలము స్కాంద పురాణ మందలి ఈశానసంహిత. శివరాత్రి చరిత్రమైన దీనియందు "లింగోద్భవము, శివరాత్రి మాహాత్మ్యము (సుకుమార చరిత్ర), యమభట ప్రమథుల కలహము" అనునవి కథావిషయములు.

తొలుత ఈ కృతి శిథిలరూపమున నాలుగాశ్వాసముల గ్రంథముగా లభించినది. దీని ప్రథమ ముద్రణము 1918 ప్రాంతమునను, ద్వితీయ ముద్రణము 1930 లోను, కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు ముద్రించినారు. ఈ నాలుగాశ్వాసముల గ్రంథమును జూచి పండితులలో కొందరు ఇది సంపూర్ణమనియు, కొంద అసంపూర్ణమనియు భావించిరి. వీరిలో ఈశానసంహితయందలి కథనుబట్టి మఱియొక యాశ్వాస కథ యున్నదనినవారి అభిప్రాయమే సత్యమైనది. తెలంగాణమందలి శ్రీ శంకు శంకరప్పగారి యింట లభించిన పూర్ణగ్రంథమును (అయిదాశ్వాసములతోఁ గూడినది) శ్రీ డాక్టర్ బి. రామరాజు 1966లో ప్రథమతః సుపరిష్కృత మొనర్చి ముద్రించినారు. వీరొనర్చిన మహోపకృతివలన కవిసార్వభౌముని శివరాత్రి మాహాత్మ్యమును సమగ్రరూపమున ఆంధ్ర పాఠకలోకము పఠించి యానందించు నవకాశము లభ్యమైనది. పూర్వము లభించిన గ్రంథమునందలి శిథిలభాగము లభించుటయే గాక, చతుర్థాశ్వాసాంతమున మహర్షులు “సుకుమారుని గూర్చి జరిగిన కలహమున ప్రమథులకూడి యముం డేమిసేసె పిదప" అని సూతునడిగిన ప్రశ్నకు సమాధానముగఁ జెప్పిన అయిదవ యాశ్వాసకథ లభించుట యీ ప్రతియందలి విశేషములు.

శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్య రచనాకాలమును గూర్చియు పండితలోకమునందు భిన్నాభిప్రాయములు వెలసినవి. తొలుత లభించిన గ్రంథమున దోషములు విశేషముగా


సాహిత్య విమర్శ

747