4. ఉన్నయశబ్దమునకు 'ఊహించుట', 'పైకివచ్చునట్లు చేయుట' వాక్యార్థము లైనను 'కడముట్టించుట' అను లక్ష్యార్థమున ఎఱ్ఱన ప్రయోగించినాఁడని, 'ఊర్ధ్వమును పొందించుట' అను అర్థముగల ఈ ఉన్నయ శబ్దము "ఉన్నత సంస్కృతాది చతురోక్తి పదంబుల (పథంబుల) కావ్యకర్తవై” అన్న పద్యమున "నిర్వహించితి”తో అన్వయించుటచే, తుదముట్టించితి నన్నదే తాత్పర్యార్థమని శ్రీ వేలూరి శివరామశాస్త్రి 'హరివంశ పీఠిక'లో నిరూపించినారు.
5. తిక్కన, ఆయన శిష్యుఁడు మారన నన్నయ "మూఁడు పర్వములను” జెప్పినాఁడనుటను, భాసుని ఊరుభంగనాటకమున దుర్యోధనుఁడు బల రామునితో అన్న "ప్రతిజ్ఞా న సితే భీమే గతే భ్రాతృశ తే దివమ్, మయిచైపం గతే రామః విగ్రహః ఓ రామా! కిం కరిష్యతి?” నా తమ్ములు నూర్గురు గతించిరి నా స్థితి యిట్లుండెను! ఓ రామా! ఇంకను నాకు యుద్ధమెందుకయ్యా? అన్నచోట (తనతోఁ గలసిన కౌరవసోదరులు నూరుగురై యుండ నూర్వురు సోదరులు మరణించినా రనినపుడు) భ్రాతృశత శబ్దమును అర్థమొనర్చుకొనిన రీతిని అర్థ మొనర్చుకొనవలయునని సమంజసముగ శ్రీ దీపాలు సూచించినారు. (భారతి జులై, 59. పు. 30).
746
వావిలాల సోమయాజులు సాహిత్యం-4