అధఃసూచిక
1. ఇతఁడు అన్నియెడల తన పేరు ఎఱ్ఱయ అనియే వ్యవహరించెను. ఐనను, భారత ప్రతులలో “ఇక్కడి నుండి ఎఱ్ఱాప్రగడ కవిత్వము” అని యుండుటచేత, పేరు చివర ప్రెగడ యను గౌరవనామము చేర్చియే వ్యవహరించుచుండిరని భావింపఁదగును. అనపోతా రెడ్డి కొల్లూరు శాసనములో ఉదహరింపఁబడిన 'యర్ర ప్రగడగారు' ఇతఁడే యైనచో, అది మరింత ధ్రువపడును. "తెలుఁగు విజ్ఞాన సర్వస్వము - పే. 733 "స్ఫురదరుణాంశు” లోని 'అరుణ' తన పేరుగఁ జెప్పినాఁడా?
2.చదలవాడ మల్లన: ఆరణ్యపర్వశేషము, రామాయణము, నృసింహపురాణము, హరివంశము; కందుకూరి వీరేశలింగము ఆరణ్య పర్వశేషములు, నృసింహపురాణము - ఆంధ్రకవుల చరిత్ర. పే. 158; శేషాద్రిరమణ కవులు : ఆరణ్యపర్వశేషము, నృసింహపురాణము, రామాయణము, హరివంశము హరివంశము పీఠిక 1926 వావిళ్ళ ముద్రణము. కవిత్వవేది : రామాయణము, హరివంశము, ఆరణ్య పర్వశేషము. నృసింహపురాణము - ఆంధ్రవాఙ్మయ చరిత్ర సంగ్రహము; మల్లంపల్లి సోమశేఖర శర్మ : ఆరణ్యపర్వశేషము, నృసింహపురాణము, రామాయణము, హరివంశము (History of the Reddy Kingdoms p. 497). చాగంటి శేషయ్య : ఆరణ్య పర్వశేషము, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము - ఆంధ్ర కవితరంగిణి సంపుటము
IV పుట 58; పింగళి లక్ష్మీకాంతము రామాయణము, హరివంశము, ఆరణ్యపర్వశేషము, నృసింహపురాణము; ఆంధ్రసర్వస్వము పుటలు 275 - 302; నిడుదవోలు వేంకటరావు : ఆరణ్యపర్వశేషము, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము; పరిశోధన ఫిబ్రవరి మార్చి 1956 - పుటలు 10-14; నోరి నరసింహశాస్త్రి: ఆరణ్యపర్వశేషము, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము : తెలుఁగు విజ్ఞాన సర్వస్వము సం 3. పు. 734.
3.ఆరణ్యపర్వము విఘ్నకారి అను ప్రతీతి దేశమున (ఆంధ్రదేశముననే కాక భారత దేశమంతటను) నుండుటచే, ఎఱ్ఱన తనకును నన్నయకు వలె మతిభ్రమణమో, మరణమో కలుగునను భీతిచే, ఆరణ్య పర్వశేషమును పూరించి నన్నయభట్టు పేరనే వెలయించియు (భారతకవులలో నొకఁడను గావలెనన్న) కీర్తిప్రియత్వము వలన పర్వాంతమున నీ పద్యములను దానే చెప్పినాఁడనుట యుక్తిసహమని కొందఱందురు. “నన్నయభట్టు తెనుఁగునన్ మహాభారతసంహితారచన బంధురుఁ డయ్యె” అని నన్నయ తన్ను గూర్చి ఇట్లు ఎవరో చెప్పినట్లు చెప్పు కొనినాఁడని వారి అభిప్రాయము.సాహిత్య విమర్శ 745