గోకదంబముల్ ప్రీతిగఁ దద్విలోకనము పేరఁ జనందగు ధారుణీశ్వరుం డీ తెఱఁగైనఁ బొమ్మను” అని ఉపాయమును సైతమన్వేషించి ఘోషయాత్రాస్రష్ట యైనాఁడు. అందుచే నిది ఘోష దర్శన (రక్షణ) చ్ఛలము (మిష) తో "పాండవుల నవమానించు యాత్ర” (ఘోష దర్శన (రక్షణ) చ్ఛలేన పాండవాపహసన యాత్రా ఘోషయాత్రా) యైనది గావున ఘోషయాత్ర.
పాండవుల నపలాపించుటకు దుర్యోధనుఁడు సకలసంపత్తితో నేఁగవలయును. ఈ యాత్రలో సైన్యము, పరివారము, నెల్ల పౌరులు పాల్గొనవలయును. కావున ఈ యాత్రకు హస్తినానగరిలో (ప్రచురణ ప్రకటన - ఘోషణము) అవసరము. కావుననే ధృతరాష్ట్రు ననుజ్ఞ లభించిన "ఆ క్షణంబు కౌతుకాతిశయ వ్యగ్రహృదయుఁ డైన ఫణధర్మేంద్ర కేతునాజ్ఞ (దుర్యోధనుని శాసనమున కరిపురంబునం దెల్ల ఘోషింపఁబడియె ఘోషయాత్ర" ఇట్లు హస్తినానగరమున ఘోషణము (ప్రకటనము) నొందిన యాత్ర [హస్తినా నగరే ఘోషితాయాత్రా] గావున ఘోషయాత్ర.
విభవాతిశయముతో నేఁగి పాండవులపై నొకరీతి జయమును గొన అందు ప్రధానాంగమైన సైన్యఘోషతో నేగుచున్న దుర్యోధనునకు ఇదియొక జైత్రయాత్ర. అట్టి సైన్యఘోష (ఉత్సాహధ్వనితోఁ గూడినది దుర్యోధన సైన్య జైత్రఘోషం ప్రకటనాయాత్రా) గావునను నిది ఘోషయాత్ర. ఎల్లవారికిది ఘోషమందలి విలాసోత్సాహముగ ప్రకటితమైనది గావున నేఁడు ఘోషయాత్రయందు దుర్యోధనుని ప్రియబాంధవులు, ఉజ్జ్వలవిభూతితో సముచితవాహనులై యాతని కొలుచుచు వెంటనేఁగుట, ఆందోళికాది వాహనములలో వేలకొలఁది ప్రియప్రమదలు చేరుట, పడఁతులతోఁ గూడి పౌరులును నడుచుట, ఇది శకట వైశ్య పణ్యాంగనా సంకులమగుట, ప్రయాణానురూప చతురంగ బలములతో నేతెంచుట, వేటయు నీ యుత్సవమున నంతర్భాగము గావున వేటకాండ్రు, విటవిదూషక వందివైతాళికాది జనులు అనుగమించుట జరిగినవి. విలాసోత్సవ బుద్ధితో నేగినవారికి నేత్రాభిరామమగు గోకదంబ దర్శనము, గోరసాస్వాదన క్రీడ, వేట, వనవిహారాదులు సంప్రాప్తమైనవి కావున వ్రేపల్లెయందలి విలాసోత్సవయాత్ర [ఘోషస్య యాత్రా ఘోషయాత్రా - యాత్రాః ఉత్సవః] యైన ఇది ఘోషయాత్ర.
గంధర్వులు యుద్ధమున ప్రవేశించుటతో ఘోషయాత్ర గంధర్వయుద్ధ ఘోష యాత్రయైనది. వారు దుర్యోధనాదులతో ఘనముగ పోరుటవలన నైనదియు, అర్జునాది
సాహిత్య విమర్శ
743