“ఘోషయాత్ర" అనునది ఘోషః, యాత్రా అను రెండు వ్యస్తపదముల చేరిక వలన గలిగిన సమాసము. “ఘోష" శబ్దమునకు అభీరపల్లి, (గొల్లపల్లి - ఘోషంతిగానో త్రఘోషః ఘుషిర్ అవి శబ్దనే శబ్దే చ - దీనియందు గోవులు ఘోషించును) గొల్లవాఁడు, శబ్దము (ధ్వని), ప్రకటనము (Proclamation) అర్థములును, “యాత్రా” శబ్దమునకు (యాం తస్యా మితి యాత్రా - యా ప్రాపణే. దీనియందు కదలిపోవుదురు, యూయతే అనయా యానంచేతి యాత్రా దీనిచేత కాలము త్రోయబడును) గమనము, భోజనాదివర్తనము, ఉత్సవము (యాత్రా దేవార్చ నోత్సవః శేషనిఘంటువు) అను అర్థములున్నవి. వీనిని బట్టి ఘోషయాత్రాకథాంశములను అన్వయించుచు, ఘట్టమున కా నామ మెంతవఱకు సార్థకమో పరిశీలింపవలసియున్నది. మహాకవి యెఱ్ఱన “మఱునాఁడు వివిధ గిరిగహనంబు లతిక్రమించి ఘోషంబు లున్న వనంబు సొచ్చి" అనియు (ఆ ౫ 374], "ఫణధరేంద్రకేతునాజ్ఞ కరిపురంబునం దెల్ల ఘోషింపఁబడియో ఘోషయాత్ర" [ఆ ౫ 374] అనియు, "ప్రకట శకట వైశ్యపణ్యాంగనాది సంకులము నుల్లసిల్లె ఘోషయాత్ర" [ఆ × 374] ఆనియు నీ ఘోషయాత్రా శబ్దములను వ్యస్తములుగను, సమాసపదములుగను ప్రయోగించినాఁడు. "అట్లగుటన్ మీ గమనంబు నా మది ప్రియంబై తోప దెబ్బంగులన్" అను చోట యాత్రార్ధస్ఫురణమును గన్పట్టుచున్నది.
దుష్టమృగ విధ్వంసమొనర్చి గోరక్షయొనర్చుటకై ధృతరాష్ట్రు నాజ్ఞవడసి దుర్యోధనుఁడు ఇందు ఘోషములున్న వనమునకు యాత్ర యొనర్చినాఁడు గావున, నిది ఘోషము కొఱకు (గొల్లపల్లె కొఱకు) అయిన ప్రయాణము [ఘోషాయ యాత్రా ఘోషయాత్రా] కావున ఘోషయాత్ర. గొల్లపల్లెయందు గోరక్ష యొనర్పవలసిన అవసరమున్నదని నిదర్శనము చూపినగాని ధృతరాష్ట్రుఁ డనుమతింపఁడు కావున, ఆ నిరూపణమునకు దుష్టచతుష్టయమునకు ఒక గొల్లవాఁడు అవసరమైనాఁడు. అతఁడే సమంగుఁడు. సమంగుఁడను గొల్లవాఁడు (ఘోషుఁడు) నిమిత్తముగా గలయాత్ర (సమంగఘోష నిమిత్తికా యాత్రా ఘోషయాత్రా) అనుటచేతను ఇది ఘోషయాత్ర.
నిజమునకు దుర్యోధనుని ఘోషయాత్ర ఘోషరక్షకై ఉద్దేశితమైనది కాదు. సామ్రాజ్యవిభవమున మెఱసి పాండవులను పరిహసించి, వారు దుఃఖితులు కాఁగా చూచి యానందించుట ఉద్దేశము. అందుకు ఊరక (ఎట్టి విషయమును లేక) రారాజు ద్వైతవనమునకు సైన్యపరివారముతో నేగుటకు ధృతరాష్ట్రుఁడంగీకరింపఁడు. ద్వైతవన ప్రయాణద్రష్టయైన కర్ణుఁడు “ఇప్పు డా ద్వైతవనంబునందు విదితంబుగ నున్నవి
742
వావిలాల సోమయాజులు సాహిత్యం-4