దివ్యతేజశ్శక్తుల నార్జించిన యర్జునునిదే అన్న యంశము, అతనికి ప్రతివీరుఁడైన కర్ణునకు సహింపరానిదైనది. అతఁడు పాండవుల నపహసింప ద్వైతవన ప్రయాణము నూహించి, వారియెడ నిత్య శత్రుభావము వహించిన రారాజు (దుర్యోధనుఁడు) బుద్ధికెక్కించినాఁడు. ధృతరాష్ట్రు ననుమతిని బడయుటలోని పాండవాపహసన ప్రయాణము ఘోషయాత్రారూపము నొందినది. నేత్రోత్సవముగ సకల బంధుమిత్ర పరివారముతో దుర్యోధనుఁడు గోకదంబమును దర్శించి, వేట ముగించుకొని ద్వైతవన సరోవర సమీపమున క్రీడాగృహములను నిర్మింపఁ జేయువేళ, నింద్రునాజ్ఞచే పాండవాపహసన దురుద్దేశమును భగ్న మొనర్చుటకై వచ్చిన చిత్రసేనుని గంధర్వ భృత్యులు కర్ణ దుర్యోధనులను అడ్డుకొనుట, దుర్యోధనుఁడు బలప్రదర్శన మొనర్చి సరోవర ప్రాంత మాక్రమింపుఁడని సైనికులను శాసించుటతో నది ఘోరసంగ్రామముగ పరిణమించుట జరిగినవి. పాండవాపహసన యాత్రాపథక పరమేష్ఠి (సష్ట - (బ్రహ్మ) యైన కర్ణుఁడు గంధర్వుల ధాటికి నిలువఁజాలక, రణభూమినుండి తొలఁగిపోయిన పిమ్మట, నొంటిగ పోరుచున్న కౌరవరాజు కాంతాపుత్ర సోదరామాత్య సహితముగ బంధితుఁడగుటయు, వారిని గంధర్వులు తీసికొనిపోవుటను జూచి భీతచిత్తులై కౌరవులు, పౌరామాత్యులు సమీపమున యజ్ఞదీక్షితుఁడై యున్న ధర్మజుని శరణుజొచ్చుటయు, అతఁడు సోదరులనంపి అమానుష పరాక్రమమున గంధర్వుల గెలిచి, వధూపుత్రానుజామాత్య సహితుఁడైన దుర్యోధనుని బంధవిముక్తుని గావించి బుద్దులు సెప్పి పంపుటయు జరిగినవి. పిమ్మట మనస్వియైన దుర్యోధనుఁడు జుగుప్సావహమైన తన యవమానమును, అమానుషమైన పాండవపరాక్రమమును తలంచి తలంచి ప్రాయోపవేశ మొనర్చి, తుదకు పాతాళలోకవాసులైన రాక్షసులు కల్పించిన ఆశతో దానిని విరమించి, తన యభ్యుదయమున నైన సైన్య మహోత్సాహముతో హస్తినకుఁ దిరిగివచ్చుట మహాభారతారణ్యపర్వము నందలి యీ సందర్భ కథాంశములు.
ఇందు దుర్యోధనుఁడు ఆభీరపల్లికి సపరివారముగ సకల సామ్రాజ్య వైభవముతో నేగుట, ఆ ప్రయాణము వలనఁగలిగిన పరిణామములు విషయములు. వ్యాసమహర్షి సంస్కృత మహాభారతమున పై కథాంశముతోఁబాటు దుర్యోధనుఁడొనర్చిన వైష్ణవయాగము, కర్ణప్రతిజ్ఞ, అర్జునుని సంహరింప దుర్యోధనుఁ డొనర్చిన యత్నములకై ధర్మజుఁడు చింతించుట అను ఘోషయాత్రాకథానంతర పరిణామముల సహితము చేర్చి, ఇరువది రెండు అధ్యాయములు గల (236-257) ఘోషయాత్రాపర్వమును రచించినాఁడు. "ఘోషయాత్ర" అను నామ మీ యంశములుగల కథాఘట్టమున కెంత వఱకు సమంజసమో పరిశీలింతము.
సాహిత్య విమర్శ
741