వేషముతో ప్రద్యుమ్నుని వజ్రపురమున బ్రవేశబెట్టి వజ్రనాభ వధాకార్యమును సాధింప నిశ్చయించుట, నా రాక్షసున కపజయమును, వధయును నిశ్చితము లగుచున్నవి.
ఈ సన్నివేశమువలన నివి సూరనార్యుఁడు కథ కొదవించిన పరమ ప్రయోజనములు :
ఇంద్రుఁడు గంగానదియందు విహరించు హంసలను తమకు వేగుపడవలసిన దని కోరుట, శుచిముఖి ప్రభావతీస్వప్న - స్వప్నానంతర వృత్తాంతములను ఇంద్రున కెఱిఁగించుట యనునవి తఱువాతి కల్పనలు. కృష్ణునితో సంభాషణ ముగించి వెడలునపుడు 'నీవు నుపాయాన్వేషణము గావింపుచునుండు మల్పకార్యం బదిగా దే వెఱవున దత్పురి చొరగావలయునో యెవ్వరోర్వఁగలరో వానిన్' అని పలికినాఁడు. ఇంద్రుఁడు వజ్రనాభాపాయమునకు ఉపాయమును భావించి హంసలు వేగు నడుపగలవని వానిని రప్పించుట సహజము.
వజ్రనాభవధకు మార్గము నన్వేషించుచున్న ఇంద్రునకు, వాని రాజ్యసంపద తుదకు వచ్చినట్లు హంసలు తెలుపుట మిక్కిలి ప్రయోజనకారియైన యంశము. తఱువాత శుచిముఖి ఇంద్రునితో ప్రభావతీస్వప్న - స్వప్నానంతర కథలను విన్నవించినది. స్వప్నమువలన ప్రభావతీప్రద్యుమ్నులకు గలుఁగు కుమారుఁడు రాజ్యమేలవలసియుండుటచే కొన్ని విషయములు జరిగినవి. రాక్షసవనితయైన ప్రభావతికి ప్రద్యుమ్నుఁడు భర్తయని పార్వతి శాసించుట ఇంద్రకార్యమునకు ప్రయోజనకారియైన యంశము.
చిత్రపటమును తిలకించి ముగ్ధయగు ప్రభావతి మన్మథరాగమును వెల్లడించుచు శృంగారవిలాసములను బ్రదర్శించుటచే నామె ప్రద్యుమ్నుని గాఢముగ బ్రేమించుచున్నదనియును, అంకురించిన యామె ప్రణయము పరిణమించి సత్ఫలము నొసఁగు ననియును వెల్లడి యగుచున్నది. శుచిముఖి తెలిపిన వృత్తాంతమంతయును దేవకార్యమునకు ఉపయోగకారకము. ఈ కల్పనలందు సూరన కడుసామర్థ్యముతో ముగ్ధయైన ప్రభావతిని సమ్మోహనముగ చిత్రించినాఁడు. తఱువాత నొక వంక కృష్ణాదుల రాజకార్యమును, మరొకవంక ప్రభావతీప్రద్యుమ్నుల శృంగారజీవితమును కడు సమర్థతతో నిర్వహించిన శుచిముఖి పాత్రను సూరనార్యుఁడు కడుజాగరూకతతోఁ ప్రవేశపెట్టినది మొదలుగ, తుదివఱకును నీ యాశ్వాసమున పోషించినాఁడు. తఱువాతి కథయందు కన్పించు తంత్రనిర్వహణ ప్రావీణ్యము, అనంతధీశక్తి, సంభాషణ చాతుర్యము, ఉచితజ్ఞత, పరేంగితజ్ఞానము, విషయనిరూపణ సామర్థ్యము మొదలగు
712
వావిలాల సోమయాజులు సాహిత్యం-4