Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/711

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ కల్పనము ఇంద్రుఁడు వజ్రనాభుని దుశ్చర్యలను శ్రీకృష్ణున కెఱింగించుట. మహాకవి సూరన ఈ సన్నివేశమున నింద్రుని దైన్యస్థితిని, వజ్రనాభుని గర్వోద్ధతిని మనోజ్ఞముగ నిరూపించినాఁడు. ఇంద్రునిచే నీతఁడు చేయించిన సంభాషణము సాధుజనరక్షణకు బద్ధకంకణుఁడైన శ్రీకృష్ణునే కాదు, పఠితలనుగూడ కరిగింపఁగలిగియున్నది. ఈ సన్నివేశము మూలమున సూరన ఇంద్రోపేంద్రులను మనోజ్ఞముగ చిత్రించి తన పాత్రోన్మీలనసామర్థ్యమును వెల్లడించినాఁడు.

వసుదేవయజ్ఞము శ్రీకృష్ణుని యజ్ఞప్రియత్వమునకు, దేవతాపక్షపాతమునకు నిదర్శనమైన సన్నివేశము. యజ్ఞదూర్వహుఁడగు కృష్ణుఁడు భవిష్యత్కాలమున వజ్రనాభ రాక్షస వధాభారము నెత్తికొనుటకు పూనుకొనునని తోఁచును. ఈ యజ్ఞాంతమున జరిగిన సన్నివేశము భద్రనట దుష్టవటువుల కలహము. సూరనార్యుఁడు ఈ విచిత్ర సన్నివేశము మూలమున, అతితీక్షముగ నడిచిన పూర్వకథాసన్నివేశముల తైక్ష్యమునుండి పరితలమనసులను చతురహాస్యమువంకకు త్రిప్పినాఁడు. బ్రహ్మచారులిందు పలికిన -

సీ. "ఏము మ్రుచ్చులమె? యూహింప మ్రుచ్చుఁదనాల
           పుట్టిన యిండ్లు మీబోంట్ల కాక !
యాటవాండ్రని నమ్మి యనుమతింపఁగ నెట్టి
           పురమైన నశ్రమంబునను జొచ్చి
పగలెల్ల నాటల బ్రమయించుచును సందు
           గొందులెల్ల నెఱింగికొనుచు, రేలు
కన్నగాండ్రగుచు నగళ్ళు ప్రవేశించి
          యందు నెంతటివారలడ్డమైన


ఆ.వె. జక్కడఁచుచుఁ బేను గ్రుక్కిన పాటిగా
నిష్టమైన యర్థ మెల్లఁ బడసి
బ్రతుకుచునికి మీ స్వభావ మింతయును ద

ప్పదు యథార్థమనుచు బలుకుటయును”

(1-108)


అను వాక్యములను 'విప్రవాక్యం జనార్దన' యనుమాట యథార్థమై పరగునట్లుగా గ్రహించుట జరిగినది. ఇంద్రుని కార్యము దెస లగ్నమైన మనసుతో నున్న శ్రీకృష్ణుఁడు, భద్రనటుని నిందించుచు పలికిన ఈ వాక్యములను ఉపశ్రుతిగ గ్రహించి, నర్తక


సాహిత్య విమర్శ

711