Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/708

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నగర మింతటి యాశ్చర్యమును గొల్పుచున్నదా? స్వర్గాధిపతుల కాశ్చర్యమును గల్గించు నగరము భూమియందు కలిగినది. ఏమనవచ్చును? ప్రభూ! సముద్రమనెడి తెఱ వెనుకనుండి వచ్చి నాట్యమునకై రంగస్థలమున నిల్చిన నట్టువరాలి వలె (నర్తకి) యీ పురలక్ష్మి యింపులుగులుకుచు నున్నది. గమనించినారా? పడమటి దిక్కున సముద్రము యొక్కయు, మిగిలిన దిక్కుల వనసమూహముల యొక్కయు నలుపు అతిశయింపఁగా నీ పురలక్ష్మి విష్ణువు హృదయప్రదేశమున సుఖించుచున్న ఠీవితో నొప్పుచున్నది.

“దోహద ధూప ధూమములతో నొప్పుచున్న యీ నగరమందలి వన సమూహమును జూచితినా, ఓ విబుధోత్తమ! నీటిని త్రావుటకై కుతూహలముతో వచ్చి పైన వ్రేలాడుచున్న మేఘమాలికతో నొప్పారు సముద్రమాయనెడి భ్రాంతిని కల్పించు నైపుణ్యముతో నతిశయించుచున్నది. తన శరీరవలయములే కోటలుగను, కిరీటములవలె ప్రకాశించు తన ఫణముల సమూహమే మేడల వరుసగను నొప్పి ఆదిశేషువు విష్ణువును విడువఁజాలక ఈ రీతిగ వచ్చి సేవించుచున్నాఁడేమోయన్న యూహ నాకు కల్గించుచున్నది. సౌధశిబిరములందలి మణుల కాంతులచే ననేకములైన వర్ణములను పొందినవై మేడలపైనున్న జెండా గుడ్డలచే నెఱుక పడక యీ ద్వారకానగరముపై భాగమున మేఘములు నిల్చినవి. ఓ ఇంద్రా! చూచితివా! ఇప్పటికిని నమ్మరాదు. అవి కాలాగరుధూపముల పొగలో లేక మేఘములో! ఆ కన్పించునది కెంపులతో గట్టబడిన మేడలచే ప్రకాశించునట్టి గరుడపచ్చల యరుగులతో నేలయో లేక లేఁజివురాకుల యెఱ్ఱందనము యొక్క యతిశయముచే తేజరిల్లు మామిడితోపో, ఆ బృహస్పతికైనను దగ్గరకు పోయి చూచినగాని నిశ్చయింప వీలులేకయున్నది.

"ఓ దేవతాధిపా! చూడుము, ఆ బంగారు కోటయందలి శృంగారోద్యానవనములో క్రీడకొఱకైన వెండికొండ కాఁబోలును, శివుని శరీరమువలె నొప్పుచున్నది. అది గొప్ప పుష్పములు గల సంపెంగ తోఁటలవరుస కాఁబోలును, శివుని పులితోలువలె ప్రకాశించుచున్నది. ఇంద్రనీలములతో నొప్పారు మెట్లవరుస కాఁబోలును. అది శివుని నాగహారమును బోలియున్నది. అది పవడములు గూర్పఁబడిన నీటిజాలు గాఁబోలును. జటాజూటకాంతితో నొప్పారుచున్నది. అది సరోవరము కాఁబోలును. ఆకాశగంగవలె నొప్పారుచున్నది. అది క్రీడానౌక కాఁబోలును. చంద్రకళవలె నొప్పారుచున్నది. విస్తారముగాఁ గదిలెడి నాచుతీవగుంపు యొక్క చక్కదనము తిరిగెడి పూఁదోటలవలెను, పెద్ద తరంగముల వరుస నడచునట్టి కోటలవలెను నురుగు ముద్దయొక్క సొగసు


708

వావిలాల సోమయాజులు సాహిత్యం-4