Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/707

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అదేరీతిగ నామె చెల్లెండ్రగు చంద్రావతీగుణవతులకు గదసాంబులు భర్తలగునట్లుగా నారదుని దీవనను కల్పించినాఁడు.

కవి ఇందలి నాయికలైన అక్క చెల్లెండ్రనందఱ నొకే రీతిగ నన్ని సందర్భములఁ జూడఁదలచుటయే ఇందుకు కారణము. మూలమునందు వజ్రనాభుఁడు కశ్యపుని యజ్ఞము ముగిసిన పిమ్మట నాతనికడ కేగినట్లును, నాతఁడు స్వర్గ రాజ్యాధిపత్య సత్త్వము వానికి లేదని తెలుపఁగా నా రాక్షసుఁడు మఱల స్వర్గముపై దండెత్తినట్లును నున్నది. మహాకవి తిరిగి వజ్రనాభునిచే స్వర్గముపై దండెత్తింపఁ జేయుట కేవలము ఇంద్రునియెడ నీర్ఘ్యాభావము నాతఁడు ప్రదర్శించుటయే యగుటవలన, దానిని మాన్పించి సూరన యాతని దృష్టిని ప్రద్యుమ్నద్రోహము (తన యంతఃపురమునఁ బ్రవేశించి కన్యామానాపహరణ మొనర్చుట) వంకకు మరల్చినాఁడు.

ఇదే రీతిగా బరిశీలించిన మూలమును సూరన సూక్ష్మదృష్టితోఁ బరికించి మార్పు చేర్పుల నొనర్చుటయే గాక, తన యపారప్రతిభతో దానినొక యపరసృష్టి గావించినాఁడని వ్యక్తమగును.

ద్వారకావర్ణనము

సముజ్జ్వలమహిమతో శ్రీకృష్ణుఁడు ద్వారకయందుండఁగా, నొకనాఁడు ప్రభువుకడకు ఇంద్రుఁడు వజ్రనాభదానవుని దుశ్చేష్టల వలన బాధనొందుచున్న లోకములకు మేలును జేకూర్చు కార్యమును గూర్చి పర్యాలోచనమొనర్చుటకు, స్వర్గమునుండి దిగివచ్చుచుండెను. అతనికి దూరమున భూదేవి ధరించిన సముద్రమనెడి మొలనూలునందలి రత్నపుమొగపో యనునట్లుగను, సముద్రమనెడి తలపాగను ధరించిన భూమియనెడి శివమూర్తి చిత్రతిలకమో యనునట్లుగను, పశ్చిమ దిక్కనెడి కట్టుకొనిన సముద్రమనెడి వస్త్రపు కొంగునందలి జలతారు మొగ్గయో యనగను, వరుణుని గోపురమునకుఁ గట్టఁబడిన సముద్రమనెడి తోరణమునకు మధ్య వ్రేలాడు పూగుత్తియో యనునట్లుగను, అనేక మణిగృహములు కాంతిచే ప్రకాశించుచుఁ గన్పట్టెను. అప్పుడు ద్వారక తన్నుఁ జూచుటకు ఇంద్రుని వేయి కన్నులును జాలక యాశ్చర్యపడు నట్లింద్రునకుఁ దోచెను.

ఇంద్రునకు మాతలి ద్వారకానగరమును వర్ణించి చూపుట

ఆ పట్టణసౌందర్యమును తిలకించి తలయూచి యాశ్చర్యమునొందుచున్న దేవేంద్రునిఁ జూచి, యాతని రథసారథియగు మాతలి "ఏమేమి? ప్రభువువారి కీ


సాహిత్య విమర్శ

707