ఈ రవివర్మ భద్రనటుని మూలముననే నడిపెను. చిత్రపట ప్రదర్శన మూలమున నాయికకు అనురాగబీజము నారోపించుట రవివర్మ కల్పనము.
పింగళి సూరన రచన రూపకము కాదు, ప్రబంధము. కావున నీతఁడు తన శ్రవ్యకావ్యమున కనుగుణముగ హరివంశ మూలము నందలి కథను మార్చుకొనెను. సూరన నాయికానాయకుల మధ్య దౌత్యమును శుచిముఖి మూలముననే నడిపినాఁడు భద్రనటుఁడు ఆడుచు పాడుచు మెలఁగెడి తేలిక మానసి. అట్టివాఁడు నాయికా నాయకుల మధ్య అనురాగమును పోషించుచు దౌత్యము నెఱపుట కనర్హుఁడని తోఁచి,రహస్య గోపనమునందు సమర్థమైన మూలమునందలి శుచిముఖిపాత్రనే సూరన గ్రహించినాఁడు. నాయిక పక్షమున పురుషునికంటె స్త్రీ దూతకృత్యము నెఱపుటకు తగినది గదా! భద్రనటదౌత్యము రసోచితము కాదని వేరె చెప్పవలసిన పనిలేదు. సూరనార్యుఁడు మూలమందలి శుచిముఖిని యథాతథముగ గ్రహింపక పునఃసృష్టి యొనర్చినాఁడు. దానికి అనంతధీశక్తి నిచ్చి కథారంగమున ప్రవేశపెట్టినది మొదలు సర్వవ్యాపారములకు సూత్రధారిని గావించినాఁడు. ఈ సృష్టియందు సూరన తన ఆత్మీయతను (Personality) ప్రతిబింబింపజేసినాఁడు.
మూలమునందు ప్రభావతీప్రద్యుమ్నుల ప్రణయమునకును, గద సాంబ సునాభపుత్రికల ప్రణయమునకును, నెట్టి సంబంధము లేదు. వారి ప్రణయము స్వాభావికపరిణామము నొందినట్లు కనిపించదు.
“ఒక దినమున వజ్రనాభుని తమ్ముడగు సునాభుని కుమార్తెలగు ప్రభావతి చెల్లెండ్రు ప్రభావతీసౌధమునకు వచ్చిరి. అపుడు వారు ప్రభావతి ప్రద్యుమ్నునితోఁ గూడియుండుటను జూచిరి. ప్రభావతి వారితో తన మంత్రప్రభావమును, దేవమానవుల నెవరినైనను తనకడకు రప్పించఁగలనని తెలుపఁగా, వారామె నా మంత్రమును జెప్పవలసినదని నేఁడుకొనిరి. ప్రభావతి ప్రద్యుమ్నుని తన చెల్లెండ్రుకు దగిన భర్తల నిరువురఁ బేర్కొనుమనఁగా నతఁడు గదసాంబుల పేర్లు చెప్పెను. ప్రభావతి చెల్లెండ్రు మంత్రప్రభావమున వారిని బిల్పించుకొని వివాహమాడిరి.”
అర్థరహితమగు దీనిని సూరనార్యుఁడు స్వీకరింపక చిలుక రాయబారమును కల్పించినాఁడు. దీని మూలమున ప్రధాన నాయికానాయకులైన ప్రభావతీప్రద్యుమ్నుల ప్రణయకథకును, వీరి ప్రణయకథకును, ప్రతియోగము (Contrast and Parallelism) కలిగినది. ప్రధాన నాయికానాయకుల ప్రణయదౌత్యమునకు మేధాసంపన్నయైన
సాహిత్య విమర్శ
705