గన్పట్టని విశిష్ట ప్రతిభగలవాఁడు. ఈతఁడు తొలుత రాఘవపాండవీయ మనెడి భాష్య, కావ్యమును జెప్పి పిమ్మట నపూర్వమైన కల్పనాసామర్థ్యమును, కథాకథనదక్షతను ప్రదర్శించుచు, నుత్పాద్యమగు కథావస్తువుతోఁ కళాపూర్ణోదయమును రచియించెను. ఇది ఆంధ్ర సాహిత్య లోకమునందు అద్వితీయ మహాప్రబంధము. ఐనను అతని కాలమునాటివారికి ఈ ప్రబంధము కేవల కల్పితమగుటచే నచ్చలేదు. 'కేవల కల్పనాకథలు కృత్రిమ రత్నములు' అన్న సూక్తి బయలుదేరినది. కావుననే పింగళి సూరన తన ప్రభావతీప్రద్యుమ్నమును మిశ్రకథగా నొనర్చెను. ఇందు సూరన మూలకథను హరివంశమునుండి గ్రహియించి, తన కావ్యరచనా శిల్పమున కనుగుణములైన మార్పులను గావించెను.
పింగళి సూరన ప్రభావతీప్రద్యుమ్న పంచమాశ్వాసము చివర
తే. "అఘహరణహరివంశ కథాశ్రయంబు
నాత్మ పుత్రగుణ స్తవనాంకితంబు
నైన యీ కావ్యమునకు మహాప్రసిద్ధి
నిచ్చుగావుతఁ గరుణ లక్ష్మీశ్వరుండు”(5-221)
అను పద్యముచే తన ప్రభావతీప్రద్యుమ్నకథకు మూలము హరివంశమని
చూపించినాఁడు. దీనినిబట్టి మూలగ్రంథమునందలి కథలోని ముఖ్యాంశములను
గ్రహించి, సూరన దన యిచ్చ వచ్చినట్లు మార్పులు చేసి సందర్భశుద్ధి, పాత్రేచిత్యము,
సంభాషణనైపుణ్యము మెరయగా సర్వోత్కృష్టమగు కావ్యమును జెప్పినాఁడని మన
మూహింపవలసియున్నది.
సమస్త పురాణములందలి కథలవలెనే హరివంశపురాణమునందలి ప్రభావతీ ప్రద్యుమ్న కథయును అసంగతములు, అసందర్భములునగు నంశములతోఁ గూడి అంగాంగీభావము బొత్తుగ లేక జల్లికూర్పు వలె నున్నది. ఈ హరివంశమందలి కథను ఇతివృత్తముగా గ్రహించి క్రీ.శ. 12వ శతాబ్దమందలి రవివర్మ (మలయాళ దేశపాలకుఁడు) ప్రద్యుమ్నాభ్యుదయ మనెడి యొక నాటకమును సంస్కృతభాషలో రచియించెను. అతఁడును సందర్భశుద్ధి లేనిదియును, నాటకోచితము కానిదియును నగు కథాభాగములను మార్చి కొన్ని నూతన కల్పనములు చేర్చి తన రూపకమును రచించెను. శుచిముఖిపాత్ర పక్షియగుటచే ప్రదర్శనానుగుణము కాకుండుట వలన దాని నతఁడు తొలఁగించెను. ప్రభావతీప్రద్యుమ్నుల మధ్య దూతకృత్యమునంతటిని
704
వావిలాల సోమయాజులు సాహిత్యం-4