క.“పురసింధు నగర్విన శశి
సరసీ వన మధు రతిప్రసంగ విరహముల్
పరిణయ తనయోదయ నయ
విరచన యా త్రాజిదౌత్య విభువర్ణనముల్.”
ప్రభావతీప్రద్యుమ్నమున ద్వారకానగర వర్ణనము, యజ్ఞవర్ణనము, అశ్వక్రీడావర్ణనము, హంసల వర్ణనము, స్త్రీవర్ణనము (ప్రభావతీవర్ణనము), విరహ వర్ణనము, చంద్రోపాలంభము, సూర్యోదయ వర్ణనము మొదలగు వర్ణనలెన్నియో యున్నవి. ఇందు ఇన్ని వర్ణనము లుండుటవలననే సూరన మహాప్రబంధమని చెప్పినాఁడాయనిపించును.
కాని ఈ వర్ణనములలో నెవ్వియును సామాన్యముగ ప్రబంధములందలి వర్ణనములవలె సుదీర్ఘములు కావు. ఈ రీతిగా సూరనార్యుఁడు తన కావ్యమున ప్రబంధ లక్షణములను పాటించియున్నాఁడు. కవితలలో వ్యంగ్యప్రధానమైన కవిత ఉత్తమకవిత. సూరన కావ్యమున వ్యంగ్యోక్తులు నెడనెడ కనిపించును. కొన్ని తావులందు శ్లేషలు ధ్వనులును నున్నవి, శృంగార రస ప్రధానమైన ఈ కావ్యమున ప్రధానముగ మాధుర్య ప్రసాదాదిగుణములు కైశిక్యాదివృత్తులు, వైదర్భిరీతి గోచరించును. శృంగారము ప్రధానరసమై అంగరసములలో అద్భుతము ముఖ్యమైనదై యొప్పు నీ ప్రభావతీ ప్రద్యుమ్నము మహాప్రబంధము.
మూలకథ - మార్పులు
ప్రబంధములందు కథావస్తువు ప్రఖ్యాతము, ఉత్పాద్యము, మిశ్రమము అని త్రివిధము. ఇందు ప్రఖ్యాతము పురాణాదులందు ఖ్యాతిగన్న కథావస్తువు. ఉత్పాద్యము కవికల్పితమైన కథావస్తువు. ప్రఖ్యాతమైన కథనే గ్రహియించి సందర్భశుద్ధి ననుసరించి కవి మార్పుల నొనర్చిన కథావస్తువు మిశ్రమము. ఆలంకారికులలో ప్రఖ్యాతుఁడైన విశ్వనాథపంచాననుఁడు ప్రబంధములలోని కథావస్తువు ప్రఖ్యాతమైయుండవలయునని నియమించినాఁడు.
ఆంధ్ర సాహిత్యమునందు జన్మించిన ప్రబంధములలోని కథావస్తువు ప్రఖ్యాతము. ప్రబంధ కవులు భారతరామాయణాది పురాణములనుండియో లేక బృహత్కథాది మహాగ్రంథముల నుండియో కథను గ్రహించి, అష్టాదశవర్ణనములతో శృంగారరసము ప్రధానముగ కావ్యములఁ జెప్పిరి. పింగళి సూరనార్యుఁడు ప్రబంధకవు లెవ్వరిలోఁ
సాహిత్య విమర్శ
703